Skip to main content

Posts

Showing posts from March 14, 2018

14Mar2018

✴️ చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి బాప్తిస్మమిచ్చు యోహాను౼“సర్పసంతానమా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు..‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను"(మత్తయి 3:7,9) అందుకు యేసు జక్కయ్యతో౼“ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే" (లూకా 19:9) ఆ నిరుపేదైన లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు (లూకా 16:22) ✴️ ■ అబ్రాహాము విశ్వాసంతో దేవునితో కూడా నడచినవాడు. దేవునికి స్నేహితుడిని లేఖనాల్లో అతనికి పేరు ఉంది. ఆయన వద్దకు దిగి వచ్చిన దేవదూతలను (దేవుణ్ని), దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. తన బలహీనతల నుండి బలమైన విశ్వాసిగా మార్పు చెందిన విశ్వాస వీరుడు. శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు తాము 'అబ్రాహాము సంతాన'మని, ఏర్పరచబడిన జనాంగమని ఉప్పొంగుతూ ఉన్నారు. ఐతే బాప్తిస్మమిచ్చు యోహాను వారిని సర్పసంతానమా అని పిలిచాడు (దేవుని అభిప్రాయం కూడా అదే). బహుశా! అంతకు ముందు ఎవ్వరూ ...