Skip to main content

14Mar2018


✴️ చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి బాప్తిస్మమిచ్చు యోహాను౼“సర్పసంతానమా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు..‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను"(మత్తయి 3:7,9)

అందుకు యేసు జక్కయ్యతో౼“ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే" (లూకా 19:9)

ఆ నిరుపేదైన లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు (లూకా 16:22) ✴️


■ అబ్రాహాము విశ్వాసంతో దేవునితో కూడా నడచినవాడు. దేవునికి స్నేహితుడిని లేఖనాల్లో అతనికి పేరు ఉంది. ఆయన వద్దకు దిగి వచ్చిన దేవదూతలను (దేవుణ్ని), దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. తన బలహీనతల నుండి బలమైన విశ్వాసిగా మార్పు చెందిన విశ్వాస వీరుడు. శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు తాము 'అబ్రాహాము సంతాన'మని, ఏర్పరచబడిన జనాంగమని ఉప్పొంగుతూ ఉన్నారు. ఐతే బాప్తిస్మమిచ్చు యోహాను వారిని సర్పసంతానమా అని పిలిచాడు (దేవుని అభిప్రాయం కూడా అదే). బహుశా! అంతకు ముందు ఎవ్వరూ వారిని ఆ పేరుతో పిలిచివుండరు. ఆ తర్వాత క్రీస్తు కూడా వారిని అలాగే పిలిచాడు (మత్త 12:34).

■ కానీ అన్యాయస్తుడు, లంచగొండియైన జక్కయ్యను ప్రభువు అబ్రాహాము కుమారునిగా పిలిచాడు. బీదవాడు, రోగియైన లాజరు చనిపోయి అబ్రాహాముకు సమీపంగా ఉన్నట్లు ఆయన చెప్పాడు. దేవుడు మనకు ఏమి చెపుతున్నాడు? ఎవరైతే దేవుడు పిలువగా తమ హృదయాన్ని కఠిన పర్చుకోక, తమ చెడు మార్గాలను విడిచి, విశ్వాసంతో దేవుని పక్షం చేరతారో వారంతా అబ్రాహాము సంతానమే! అబ్రాహాము వలె గొప్ప విశ్వాసాలను రుజువు పర్చకపోవచ్చును గాని అబ్రాహాము నడచిన మార్గంలో కాలు మోపి-నడిచేవారిగా ఉంటే చాలు. లాజరు తన కటిక బీదరికంలో దేవుణ్ని దూషించక, నమ్మకంగా సేవించాడు. జక్కయ్య అన్యాయపు సిరి, భోగభాగ్యాల కంటే దేవుణ్ని హత్తుకోవడమే ఘనంగా భావించి అంతా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది అబ్రాహాము నడచిన మార్గం. నీవు ఈ మార్గంలో నడుస్తున్న వ్యక్తివైతే నీవు అబ్రాహాము కుమారుడవే! మరణానంతరం అబ్రాహామును దగ్గర నుండి చూస్తావు.

■ అబ్రాహామును పోలిన జీవితాలు లేకుండా ఆయన స్వతంత్రించుకున్న వాగ్దానాల్లో పాలినవారుగా ఉంటామని భావించి, అతిసయపడటం మూర్ఖత్వమే! గొప్పదైవజనులతో సాన్నిహిత్యం, వారిపై వల్లబారిన అభిమానం నీ భక్తిజీవితాన్ని సూచించదు. వారి వలె నడవకుండా అతిసయిస్తూ మిగితా వారిని చులకనగా చూస్తుంటే గనుక అది పరిసయ్యుని భక్తే! శాస్త్రులు, పరిసయ్యులు గాని అబ్రాహాము కాలంలో జీవించినట్లతే వారు అతణ్ని దైవజనుడిగా చూడరు గాని ద్వేషించివుండేవారు. ఎందుకంటే అబ్రాహాము కంటే గొప్పవాడైన క్రీస్తుతో వారు అలాగే ప్రవర్తించాడు. ప్రతి తరంలో ఇలాగే జరుగుతుంది. వారి తరానికి ముందున్న భక్తిపరులను౼దైవజనులుగా అంగీకరిస్తారు(కానీ వారి వలె నడవరు), వారిని హింసించిన వారిని కూడా ద్వేషిస్తారు! మేము అలా చేయము అనుకుంటారు. కాని తమ తరంలో౼ నీతిమంతులను ద్వేషిస్తారు, తమలాంటి (పరిసయ) గుంపును హత్తుకుంటారు. స్వపరీక్ష చేసుకో! అబ్రాహాము వంటి జీవితాన్ని కోరుకుంటూన్నావా? లేక వ్యర్ధాతిశయాల దగ్గరే ఆగిపోయావా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...