✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు.
వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తిరిగి రాడు” అని జవాబిచ్చాడు (2సమూ 12:15-22) ✴️
■ దేవుని ఆలోచనలు మానిషి జ్ఞానానికి మించినది. ఆయనకున్న జ్ఞానమంతా తెలుసుకోవాలన్నా, అది ఈ మట్టి బుర్రలో ఇమటం అసాధ్యం. ఆయనకై ఆయన కనపర్చుకున్న మట్టుకే మనం తెల్సుకోగలం. మనకు అర్ధం కాని చోట్ల ఆయనను మంచితనాన్ని, పరిశుద్ధతని నమ్మి, ఆయన అధికారానికి లోబడమే నీతి. ఆయన ఆలోచనలు మనవంటివి కావు. ఆయన నిర్ణయాలు, తీర్మానాలు అనాధికాల సంకల్పాలను నెరవేర్చుతాయి. కొన్నిసార్లు మనం సుదీర్ఘకాలంగా ప్రార్ధిస్తున్నవి, దేవుడు అనుగ్రహించక పోవచ్చును. కొన్నిసార్లు అనుకోని విధంగా దేవుడు మన మార్గాలు త్రిప్పవచ్చును. దావీదు దేవుణ్ని ముందు పెట్టుకొని జీవించే ఒక విశ్వాసి. దావీదు తప్పు చేసినప్పుడు దేవుని యెదుట పశ్చాత్తాపడుతూ, దైవ శిక్షను ఆహ్వానిస్తూనే, ఆయన కనికరం కోసం వేడుకున్నాడు. కానీ అందుకు దేవుడు అనుమతించలేదు. ఐనప్పటికీని అతడు తీర్పును గౌరవించాడు. ఒకవేళ
మనం తప్పు చేయనప్పటికిని మన పట్లనున్న దేవుని నిర్ణయాలను గౌరవించాలి.
మనం తప్పు చేయనప్పటికిని మన పట్లనున్న దేవుని నిర్ణయాలను గౌరవించాలి.
■ దేవుణ్ని హత్తుకుని జీవించే విశ్వాసి తమపై దేవుని సర్వభౌమాధికారాన్ని, ఆయన నిర్ణయాలను గౌరవించడం నేర్చుకోవాలి. అంటే ఆయన మాటకు 'అవును ప్రభువా!' అని ఆయనతో ఏకీభవించడం. ఇలా కాని నువ్వు చేస్తూ, ఆయన చిత్తం కోసం ఎదురుచూస్తూ, కనిపెట్టే వ్యక్తివైతే నువ్వు సిగ్గుపడవు. నిశ్చయంగా ఆయనపై నిరీక్షణ పెట్టుకున్న వారిని దేవుడు శాశ్విత కాలం సిగ్గుకు అప్పగించడు. ఈ పరిమిత కాలంలో నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. దాని మూలంగా నీవు దేవుణ్ని ఆనుకోవడం(ఆధారపడటం), నిరుస్సాహ పరిచే మనుష్యుల మాటల వైపు కాక దేవుని వైపు నిరీక్షణ ఉంచడం లాంటి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుంటావు. దేవుణ్ని ప్రేమిస్తూ, ఆయన ఆధిపత్యంలో జీవించడానికి ఇష్టపడేవారి జీవితంలో ప్రతి ఒక్క సంఘటన వెనుక ఒక మంచి ఉద్దేశ్యం ఉంటుంది. ఓ విశ్వాసీ! అది నీవు నమ్మాలి. నీవు నమ్మినట్లైతే ఆయన సర్వభౌమాధికారాన్ని గౌరవిస్తావు. నీవు గౌరవిస్తున్నట్లైతే నీలోని దుఃఖాన్ని జయిస్తావు. దావీదు వలె నిమ్మళంగా ఉంటావు (1సమూ 1:18).
★ కనుక దావీదు వలె దేవుని తీర్పును స్వాగతించు! ఆయన నీ కొరకు మేలైన ప్రణాళికలు రచిస్తున్నాడని నమ్ము! ఆయన చిత్తం కోసం కనిపెట్టు! నీ చెవిలో గుసగుసలాడే అపవాది నిరుస్సాహ బాణాలను విశ్వాసంతో నీ కాళ్ల క్రింద త్రొక్కు! దేవుడు ఈ విశ్వాస పాఠాలను మనకు నేర్పును గాక!
Comments
Post a Comment