Skip to main content

Posts

Showing posts from March 24, 2018

23Mar2018

✴️ పేతురు౼"అక్రమమైన ధనార్జన కోసం ఆశపడిన బెయోరు కుమారుడైన బిలామును అనుసరించి వారు తప్పిపోయారు. తిన్నని మార్గాన్ని వదిలిపెట్టారు. అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.  ఇలాంటి దుర్భోధకులు నీళ్ళు లేని బావుల్లాంటి వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాంటి వాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు" (2 పేతురు 2:15-17) ✴️ ■ దేవుని వాగ్ధాన దేశమైన కనానుకు ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు(మోయాబు రాజు), ప్రవక్తయైన బిలామును కోరాడు. బిలాము దేవుని యొద్ద కనిపెట్టగా౼"వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, కనుక శపించునట్లుగా నీవు రాజు నొద్దకు వెళ్లకూడదని" స్పష్టంగా చెప్పాడు. కాని రాజు మరి ఎక్కువ బహుమతిని ఆశ చూపాడు. అప్పుడు బిలాము మాటలు గమనిస్తే ఎంతో ఆత్మీయంగా కనిపిస్తాయి (సంఖ్యా 22:8,18,19). 'ఇంటి నిండా వెండి, బంగారాలిచ్చినా దేవుని ఆజ్ఞను మీరలేను. కానీ వేచి ఉండండి..మరోసారి దేవుని వద్ద కనిపెడతానని' చెప్పి, తనలోని ధనాశను దేవుని ఎదుట బహిరంగ పర్చాడు. పైపై మాటలను బట్టి మోసపోవడానికి దేవు...