✴ యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు. యెహోవా కయీనుతో౼"ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు నీ మొఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుని ఉండేవాడివి కదా!" (ఆది 4:4-7) ✴ ■ దేవుడు ఆ అన్నదమ్ములిద్దరూ అర్పించిన అర్పణల కంటే వారి జీవితాలను, వారి ఉద్దేశ్యాలను పరిగణనలోకి తీసుకుంటున్నాడు. దేవుడు హేబెలును అంగీకరించాడు కానీ కయూను అంగీకరించలేదు. ఐతే కయూను దీనిని బట్టి కోపం తెచ్చుకున్నాడు... కానీ నిజానికి అది అతను చూపించాల్సిన సరైన చర్య కాదు (It's a wrong reaction). దీనిని బట్టే అతని హృదయం చెడిపోయినదని స్పష్టంగా తెలుస్తుంది. తనను తాను పరీక్షించుకొని, తన క్రియలను బట్టి పశ్చాత్తాపడాల్సిన దానికి బదులుగా అసూయ, క్రోధాలతో హృదయం అతని నిండిపోయింది. ■ ప్రతి మనిషిలో తన స్వంత స్వభావం మరియు మనస్సాక్షిలు పని చేస్తాయి. ఈ మనస్సాక్షిలో దేవుడు ఆయన నియమావళిని వ్రాశాడు. కనుకనే మన ప్రవర్తనతో సంభంధం లేకుండానే మనస్సాక్షి మంచిని గూర్చిన హెచ్చరికలు చేస్తూ ఉంటుంది(మన జీవితాల్లో చాలా సార్లు తొంద...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.