✴ యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.
యెహోవా కయీనుతో౼"ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు నీ మొఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుని ఉండేవాడివి కదా!" (ఆది 4:4-7) ✴
■ దేవుడు ఆ అన్నదమ్ములిద్దరూ అర్పించిన అర్పణల కంటే వారి జీవితాలను, వారి ఉద్దేశ్యాలను పరిగణనలోకి తీసుకుంటున్నాడు. దేవుడు హేబెలును అంగీకరించాడు కానీ కయూను అంగీకరించలేదు. ఐతే కయూను దీనిని బట్టి కోపం తెచ్చుకున్నాడు... కానీ నిజానికి అది అతను చూపించాల్సిన సరైన చర్య కాదు (It's a wrong reaction). దీనిని బట్టే అతని హృదయం చెడిపోయినదని స్పష్టంగా తెలుస్తుంది. తనను తాను పరీక్షించుకొని, తన క్రియలను బట్టి పశ్చాత్తాపడాల్సిన దానికి బదులుగా అసూయ, క్రోధాలతో హృదయం అతని నిండిపోయింది.
■ ప్రతి మనిషిలో తన స్వంత స్వభావం మరియు మనస్సాక్షిలు పని చేస్తాయి. ఈ మనస్సాక్షిలో దేవుడు ఆయన నియమావళిని వ్రాశాడు. కనుకనే మన ప్రవర్తనతో సంభంధం లేకుండానే మనస్సాక్షి మంచిని గూర్చిన హెచ్చరికలు చేస్తూ ఉంటుంది(మన జీవితాల్లో చాలా సార్లు తొందర పడి ప్రవర్తించిన తర్వాత, మనస్సాక్షి చేత గద్దించబడి దుఃఖపడతాము, సరిచేసుకుంటాము). ఐతే మన స్వంత స్వభావం ఆ గద్దింపుకు లోబడవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎప్పుడైతే మనస్సాక్షికి (అనగా దేవునికి) వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ,మన పనుల్ని మనం సమర్ధించుకుంటూ వెళ్తామో మనస్సాక్షి స్వరం ఆ విషయంలో మెల్లిగా వినపడకుండా పోతుంది. తద్వారా హృదయం కఠినమై ఆ పాపం మనల్ని బానిసలుగా చేసుకుంటుంది. మనస్సాక్షి స్వరం ముగబోతుంది. కనుకనే కొందరికి అసహ్యంగా, బాధగా అనిపించే పనులు, కొందరికి చీమ కుటినట్లుగా అనిపించదు.
■ కయీను తన మనస్సాక్షిని కఠినం చేసుకుంటూ, దేవుని మాటను లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తునే భక్తి జీవితంలో ఉన్నానని భ్రమపడ్డాడు. భక్తి అంటే అర్పణ తీసుకురావటం కాదు గాని దేవుని మాటకు లోబడి..మనస్సును కల్మషం లేకుండా శుభ్రపరుచుకోవడం. మెత్తటి మనస్సును కలిగి, మన చర్యలను మనం సమర్ధించుకోకుండా, దేవుని ముందు పరిశీలన చేసుకుంటూ, తప్పును యదార్ధంగా ఒప్పుకుంటూ సరిదిద్దబడటం. ఇటువంటి విధేయతే దేవుడు ప్రతి మనిషి నుండి కోరుతున్నాడు. అలాంటి వారు సత్యమై ఉన్న దేవుణ్ణి తప్పక కలుసుకుంటారు.
(విశ్వాసి జీవితంలో దీనితో పాటు దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు.. క్రీస్తు సారూప్యంలో మారడానికి మరియెక్కువగా సహాయకారులుగా ఉంటారు)

Comments
Post a Comment