Skip to main content

Posts

Showing posts from March 26, 2018

26Mar2018

✴️ఓలివ కొండ నుండి దిగే చోటికి ఆయన గాడిదపై వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు. ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు౼“బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. ఆయన౼“వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. (లూకా 19:37-40) యేసు దేవాలయానికి వచ్చినప్పుడు గుడ్డివారు, కుంటివారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.౼“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని చెప్పాడు (మత్తయి 21:14-16) ✴️ ■ వారు చూసిన దేవుని అద్బుతకార్యాలు కొందరి నోట స్తుతిని ఉంచగా, మరికొందరికి అసూయను, ద్వేషాన్ని ...