★ యేసు సుంకరియైన మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలా మంది అన్యాయస్థులైన పన్నులు వసూలు చేసే వారూ, పాపులూ వచ్చి ఆయనతోనూ, ఆయన శిష్యులతో పాటు కూర్చున్నారు. మతనిష్ఠ గల పరిసయ్యులు అది గమనించి౼“మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యుల్ని అడిగారు. యేసు అది విని౼“ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడాన ికే వచ్చాను, నీతిపరులను కాదు.” అని చెప్పాడు. (మత్తయి 9:10-13) ★ ■ పరిసయ్యులు దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, విశ్రాంతి దినం-పవిత్ర పండుగలను ఆచరించడంలోనూ ఎంతో మతనిష్ఠను పాటిస్తారు మరియు నిత్యం ఉపవాసాలతో, ప్రార్ధనల్లో తాము ఉంటారు గనుక తామే పవిత్రలమని అనుకుంటారు. మత నిష్ఠలేని, తప్పుడు పనులు చేసే వారంతా పాపాత్ములనేది వారి భావన. కనుక వారితో కలిసి భోజనం (సహవాసం) చెయ్యడానికి కూడా ఇష్టపడరు. అలా చేయడం ద్వారా దేవుడు తమ పట్ల ఎంతో సంతోషిస్తాడని భావిస్తారు. ■ కానీ దేవుని స్వభావం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. యేసు పాపుల స్నేహితునిగా పిలవబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వారి మధ్యలో జీవించాడు. భూమిపై నివసించ...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.