యేసు౼"నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు" (మత్త 5:11,12).
పరిమిత జ్ఞానం కలిగిన మనిషి, అనంతుడైన దేవుని ఆలోచనలను సంపూర్ణంగా ఎన్నడూ అర్ధం చేసుకోలేడు. దేవుడు విశ్వాసి జీవితంలో శ్రమలను, అవమానాలను తప్పించకుండా ఎందుకు అనుమాతిస్తున్నట్లు?
శ్రమ వెనుక దేవుని ప్రణాళిక:--
◆ శ్రమ విశ్వాసిని పరీక్షిస్తుంది: పేతురు శ్రమ రానంత వరకూ 'నీ కోసం ప్రాణం పెడతా' నని అన్నాడు. శ్రమ ద్వారా పరీక్ష కలిగినప్పుడు తన స్థితి తాను గ్రహించగలిగాడు.(లూకా 22:33, 62)
◆శ్రమ విధేయతను నేర్పిస్తుంది: క్రీస్తు దేవుని కుమారుడైనప్పటికీ శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు.(హెబ్రీ 5:8)
◆శ్రమ ఓర్పును, దేవుని పై విశ్వాసాన్ని పుట్టిస్తుంది: శ్రమల గుండా వెళ్తున్న థేస్సలోక సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ ఈ విషయాలను ప్రస్తావించాడు.(2థేస్స 1:4)
◆శ్రమ దేవుణ్ని అనుకోవడం నేర్పుతుంది: అరణ్యంలో సౌలు నుండి దూరంగా పారిపోతూ ఉన్న దావీదుకు దేవుడే ఆశ్రయ దుర్గంలా దేవుడు కనిపించాడు. (కీర్త 18:2)
◆శ్రమ ఆత్మీయ పాఠాలను నేర్పుతుంది: కరువు వచ్చిందని కానానుకు వదిలి ఐగుప్తుకు వెళ్లిన అబ్రహంకు దేవుడు ఆత్మీయ పాఠాలను నేర్పాడు, కనుక తర్వాత బంజరు భూమిలో కూడా పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని చూశాడు.
(ఆది 12:10, 13:10-12)
◆శ్రమ దేవుని బలాన్ని తెలుసుకునేట్లు చేస్తుంది: ముందు సముద్రం, వెనుక శ్రతువులతో బాంబేలెత్తిన ఇశ్రాయేలీయులు ఉరకనే నిల్చొని దేవుని శక్తిని చూశారు.(నిర్గమ 14:13)
◆శ్రమ దేవునికి మహిమ తెస్తుంది: షడ్రకు, మేషాకు, అబేడ్నోగుల దేవుడే దేవుడని రాజు దేవుణ్ని మహిమ పర్చాడు.(దానియేలు 3:28)
◆శ్రమ రక్షణకు మార్గాలు తెరుస్తుంది: కొరడా దెబ్బలు తిని, చేరసాలలోని పౌలు, సీలల ద్వారా అదే రాత్రి చేరసాల నాయకుని ఇంటి వారందరికి రక్షణను సిద్ధం చేశాడు.(అకా 16:24,33)
౼ శ్రమల్లో మన కొరకు దేవుడు దాచివుంచిన ఆధ్యాత్మిక మేలును గ్రహిస్తే, శ్రమ పర్చిన వారు మనకు దేవుని మేలుల పాత్రను మోసుకొచ్చే దేవుని పనిముట్లు లాగే కనిపిస్తారు.శ్రమను సహించిన మనకు దేవుడు నిర్ణయించిన నిత్యజీవానికి తగిన వారినిగా యెంచిన దేవుని తీర్పు సరైనదేనని రుజువు చేస్తుంది(2థేస్స 1:5,8). సాతాను తలపెట్టే ప్రతి కీడును కూడా దేవుడు తన బిడ్డలకు ఆత్మీయ మేలులుగా మార్చుతాడు.దేవుని నిమిత్తం ఎవరైనా శ్రమ పడితే ఆనందించమని దేవుని వాక్యము చెప్తుంది.దానికి ప్రతిఫలం దేవుని చేతిలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.పౌలు అపోస్తులందరిలో ఎక్కువ శ్రమలను అనుభవించిన వ్యక్తి కనుకనే నేటికీ అనేకులకు మాదిరిగా ఉండి దీవెనగా ఉన్నాడు.శ్రమల ద్వారా దేవునిపై నీకున్న ప్రేమను నిరూపించుకోవడానికి భూమిపైనే చక్కటి అవకాశం, పరలోకంలో శ్రమలు,త్యాగాలు ఉండవు.
(మనమెందుకు శ్రమ పరచే వారితో పోరాడకూడదు..తర్వాత ధ్యానల్లో)
Comments
Post a Comment