❇ కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత కొర్నేలీ దగ్గరికి వచ్చి౼“కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు.
అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి౼“ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు.
అందుకు దూత౼“నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.❇
అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి౼“ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు.
అందుకు దూత౼“నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.❇
■కొర్నేలి౼మంచిమనస్సున్న భక్తిపరుడుగా ఉన్నప్పటికీని, అతను రక్షింపబడిన వాడు కాదని బైబిల్ చెప్తుంది(అపో 11:14). అనగా కొర్నేలి జీవితకాలమంతా ప్రార్ధనలు క్రమంగా చేసుకుంటూ..ఇతరులకు మేలు చేసేవానిగా ఉంటూ..ఆ మంచి పనులు పరలోకంలో దేవునికి జ్ఞాపకార్ధంగా చేరినప్పటికీ..అవేవి అతన్ని రక్షింపలేకపోయ్యాయి.ఏ వ్యక్తి తన మంచి పనులను బట్టి దేవుని రాజ్యం చేరుకోలేడని బైబిల్ ఖండితంగా చెప్తుంది. 'ఆదాము' అనే ఒక్కడే మనిషి నుండి వచ్చిన మనల్నింతా దేవుడు మార్గం తప్పి నశించుపొయ్యే పాపాత్ములుగా దేవుని చూస్తున్నాడు. అంటే మనుష్యులందరి చేత గొప్ప పాపాత్మునిగా పిలవబడే వానికీ, అలాగే మంచివానిగా పిలువబడే కొర్నేలిలాంటి వానికీ, మరణాంతం ఒకే చోటునే(నరకానికే) దేవుడు నియమిస్తాడు. ఏ భేదం లేకుండా అందరూ దారి తప్పిన వారే! ఒక్కడే క్రీస్తు మనుష్యులందరి కోసం చనిపోతే ఇక చిన్న పాపి, పెద్ద పాపి అనే భేదం ఎక్కడుంది? ఒకరి మీద మరొకరు అతిశయించడానికి ఆస్కారమేది? కనుక ఎవరిని చూసి నేను వారికంటే బాగానే ఉన్నానని అతిశయ పడకూడదు.
■ తన బాహ్యజీవితం బాగానే ఉందని కొర్నేలి సంతృప్తిపడలేదు గాని అంతరంగంలో తాను పాపినని గ్రహించి దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు మనుష్యుల దగ్గరకు క్రీస్తు రక్షణ సువార్తను చేరవేసి పరిశుద్ధాత్ముని ద్వారా సత్యాన్ని గూర్చిన సాక్ష్యమును పలుకుతాడు. యదార్థవంతులూ, సత్యానికి లోబడే ప్రతి ఒక్కరూ, తన వ్యక్తిగత పాప జీవితాన్ని మరుగు చేసుకొక, రక్షకుడైన క్రీస్తు అవసరతను గుర్తెరిగి ఆయన్ను ఆశ్రయిస్తారు (కొర్నేలి యదార్థవంతుడు). కానీ మత పెద్దలైతే తమ వద్దకు వచ్చిన దేవుని రక్షణను పామరుడైన పేతురును చూస్తూ బుద్ధిపూర్వకంగా తిరస్కరించారు(అపో4:13). శాసించగలిగే స్థానంలో ఉన్న శతాధిపతియైన కొర్నేలి, పేతురులాంటి సామాన్యుడి (జాలరి) నుండి దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడి దీనుడయ్యాడు.
■ సహజంగా మనం చేసే తప్పు ఏమిటంటే రక్షణ పొందిన దినాల్లో మన స్థితిని గుర్తిస్తాం కానీ దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు,"దేవుని పనిని జరిగించడానికి దేవునికి నా సహాయం అవసరం,అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు" అన్నట్లు ప్రవర్తిస్తాము.అలా అని బయటకు చెప్పం కానీ అలానే ప్రవర్తిస్తాము. మనకు మనం గొప్పవారిగా కనిపిస్తాం, మిగితావారంతా అల్పులుగా కనిపిస్తారు. క్రీస్తు మన జీవితంలో ఉన్న దాన్ని బట్టి, ఏమైనా మంచి మనలో నుండి వస్తుంది అంటే మట్టి ఘటాల్లో దేవుడు నింపిన మహిమేనని గుర్తెరగాలి.'రక్షణకు ముందు మనం(క్రీస్తు లేకుండా) ఎలా దేవుని ముందు వట్టివారమో, రక్షణ పొందిన తర్వాత కూడా క్రీస్తు లేకపోతే వ్యర్థులమే' అన్నది దృఢంగా తెలుసుకోవాలి. క్రీస్తులో తప్ప ఇక మనకు అతిశయించడానికి కారణమేది!? నిజంగా దేవునిలో మనం లోతుగా దేవునిలో ఎదుగుతున్నట్లైతే మన నిజస్థితిని మనం గుర్తించి దీనులమౌతాము. (1తిమోతి 1:15)
Comments
Post a Comment