పరిశుద్ధాత్మ-"ఆనాడు ఎడారిలో మూర్ఖులైన మీ పూర్వీకులు నాకు కోపం రేపి ఎదురు తిరిగారు. నా సహనాన్ని పరీక్షించారు.కాని నేడు మీరాయన మాటలు వినబడుతున్నప్పుడు మీ హృదయాలు కఠిన చేసుకోకండి.
నేను 40 సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు. కనుక నేను ఆ తరంవారిమీద కోపపడి,
౼ 'వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో సత్యానికి దూరంగా ఉంటున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు' అని ప్రమాణం చేశాను"
౼ 'వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో సత్యానికి దూరంగా ఉంటున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు' అని ప్రమాణం చేశాను"

'మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం! (పాలివారమైఉంటాము)'

దేవుడు 40 ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో పడిపోయాయి. తన విశ్రాంతిలో ప్రవేశించరని ఆయన శపథం చేసినది ఎవరిని గురించి? అవిధేయులను గురించే గదా.
దీన్నిబట్టి, వారు అవిశ్వాసం కారణంగా ప్రవేశించలేక పోయారని గ్రహిస్తున్నాం" (హెబ్రీ 3:7-18)

దేవుని విశ్రాంతిని గూర్చి ఇశ్రాయేలీయులకు ప్రకటన జరిగినట్లే మనకూ జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది.(హెబ్రీ 4:1,2)


Comments
Post a Comment