Skip to main content

19 July 2017


 ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చి, అక్కడ సమాధి పైన ఉంచిన రాయి తీసి ఉండటం చూసింది..మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది.
ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు.
దేవదూతలు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?"
మరియ-"ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు"
ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండటం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్ట లేదు.
యేసు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవర్ని వెదకుతూ ఉన్నావు?". ఆమె ఆయన్ను తోటమాలి అనుకుని-
"అయ్యా! ఒకవేళ నువ్వు ఆయన్ను తీసుకు వెళ్తే, ఆయన్ను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ను మోసుకొని వెళ్తాను"
అప్పుడు యేసు- "మరియా" అని పిలిచాడు.
 
 పునరుద్దాన దినం రోజు ఆయన తల్లియైన మరియ గూర్చిన ప్రస్తావన లేదు, కాని 4 సువార్తల్లో మగ్దలేనే మరియ(7దయ్యాలు పట్టి, యేసుచేత బాగుచేయ్యబడ్డ స్త్రీ) గూర్చి వ్రాసివుంది. మగ్దలేనే మరియకు ఆయన పునరుద్దానం గూర్చి గొప్ప విశ్వాసం ఉన్నట్లు కనిపించట్లేదు(మార్కు 16:1,3). కాని ప్రభువు మీద నిండైన ప్రేమ ఉంది.ఆ దినాల్లో శిష్యులు సైతం ప్రాణభయంతో దాగి ఉన్నారు. పెద్ద రాయి చేత మూయబడి, కావలి వారి చేత భద్ర పరచబడి, ప్రభుత్వం ముద్ర వేయబడన సమాధి దగ్గరకు వెళ్ళడానికి స్త్రీలకు ఎంతో ధైర్యం(ప్రేమ) కావాలి.
 ప్రభువు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను ముందే సిద్ధపరచుకొని, ఎవరో ఒకరు తప్పక రాతిని పొర్లిస్తారని ఆశతో పెందలకడనే లేచి సమాధి వైపు నడచిన నడకలో ఆమెకు(ఆ స్త్రీలకు) దేవుని పట్ల ఉన్న ఆ ప్రేమను దేవుడు గుర్తించాడు. కనుకనే తన దూతను పంపి రాతిని వారి నిమిత్తమే తొలగించాడు.
 మగ్దలేనే మరియ తనకు తెలియకుండానే దేవదూతల ముందు, ప్రభువు ముందు తన ప్రేమను తెలియజేసింది. ఆమెకు దేవునిపై ఉన్న ప్రేమే, ఆమెను దేవుని ముందు ప్రత్యేకంగా నిలబెట్టింది. పరలోక తండ్రిని కలుసుకోక ముందు ప్రభువు మహిమ దేహంతో మొదట ఆమెకే దర్శనమిచ్చాడు (యోహాను 20:17). బలహీనులైన(వాక్య జ్ఞానంలో, విశ్వాసంలో మె|| విషయాల్లో) వారిని సైతం దేవుని యెదుట ప్రత్యేకంగా నిలిపేది, దేవునిపై వారికున్న ప్రేమే!తన దుస్థితిలో దేవుడు చూపిన ప్రేమ, కనికరంలో నుండే, కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రేమ పుడుతుంది.
 పౌలు-"విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడూ నిలుస్తాయి. ఐతే వీటిలో ఉన్నతమైనది ప్రేమే"(1కొరింధి13:13)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...