యేసు ఒక కథ చెప్పాడు.
❇ ఒక ధనవంతుడి భూమి విస్తారంగా పండింది. అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు. "నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. నా కొట్లు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ దాచి నిల్వ చేస్తాను.

అప్పుడు నా ప్రాణంతో "ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు అని చెప్తాను" అనుకున్నాడు.
అయితే దేవుడు అతడితో "మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?" అని అతడితో అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు"
❇





౼ మన జీవితానికి వెలుగైవున్న(సత్యమైవున్న) దేవుణ్ని మరిచిపోతే, గనుక ఎటువైపు వెళ్తున్నామో తెలియని (అబద్దమైన) చీకట్లో బ్రతుకుతాము.
Comments
Post a Comment