❇ "ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు.ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు"(నిర్గమ 2:11)
❇
✔ దేవుడు ఎన్నుకొన్న మోషేలో ఆవేశం, కోపం అనే బలహీనతలు కనిపిస్తున్నాయి. అతను దేవుని స్వరూప్యంలోకి మారటం అంటే వీటి స్థానంలోకి దీర్ఘశాంతం, సాత్వికం ధరించుకోవడం. మోషే దైర్యంగా దేవుని కోసం నిలబడటం ఇప్పటికే నేర్చుకున్నాడు (దైర్యం అతని స్వభావం సిద్ధంగానే ఉన్న లక్షణం). ఇప్పుడతడు దేవునిపై ఆధారపడుతూ నిమ్మళంగా ఉండే క్రీస్తు రూపంలోకి మారాల్సివుంది.
✔ కొందరు తమ దైర్యంబట్టి అతిశయిస్తూ, అలా లేని వారిపట్ల చిన్న చూపు చూస్తారు.ఇప్పుడు అవసరమైనది విరువబడిన అనుభవం. బలవంతుడను అనుకున్నవాడు బలహీనుడుగా ఎంచుకోవాల్సివుంది. అప్పటి వరకు దేవుడు మోషేని వాడుకోలేకపొయ్యాడు.
❇ దేవుడు-“యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు. ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి. ప్రజలకు నీవు భయపడవద్దు. నీవు ప్రజలకు భయపడితే, వారి ఎదుట నేను నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తాను"(యిర్మీయా 1:17) 
❇
✔ యిర్మీయా మృదు స్వభావి. యిర్మీయా విషయంలో దేవుని స్వరూప్యంలోకి మారటం అంటే భయాన్ని వీడి, దైర్యంగా దేవుని కొరకు నిలబడగా, వచ్చే ప్రతి శ్రమకు భయపడకుండా నిలబడటం.
✔ కొంతమంది తమ సాక్ష్యం చెడిపోతుందనో, కొన్ని అవకాశాలు (వనరులు) కోల్పోతామనో, భయం చేతనో, నష్టం, హాని జరుగుతుందనో, నాకెందుకనో, మౌనమౌతారు. అలాంటి వారు దీనులు, సాత్వికులు కారు. మోసపోవొద్దు!మనుష్యులు అలా పిలవచ్చేమో గాని దేవుడు పిలువడు. నీ మౌనం దేవుని బట్టి మరియు 'నేను' అనే పాత స్వభావం శిలువ వేయడాన్ని బట్టి రావాలి. దేవుడు కోపపడే చోట మౌనం వహించినా అది పాపమే అవుతుంది. ఇలాంటి స్వభావం గల వారు దేవుణ్ని బట్టి మాట్లాడటం, గద్దించడం నేర్చుకోవాల్సివుంది. అవసరమైతే దేవుని నిమిత్తం అప్పటివరకు ఉన్న సాక్షాన్ని సైతం వదులు కోవడానికి సిద్ధంగా ఉండాలి.
↪ పైన చేప్పిన రెండు రకాలైన వ్యక్తులు, దేవుని పనికి అవసరమైన వారే. తమకు బలం అనుకున్న బలహీనతలను బట్టి అతిశయించక, క్రీస్తు శరీరంలోని విభిన్న అవయవాలమని గుర్తెరిగి, ఒకరి వ్యక్తిత్వాలనొకరు గౌరవిస్తూ, మార్పు చెందాల్సిన వాటి విషయమై దేవుని సన్నిధిలో ఆపేక్షించబద్ధులమై ఉన్నాము.





❇



Comments
Post a Comment