అబ్రాము "పశువుల కాపరులు", లోతు "పశువుల కాపరులు" గొడవపడ్డారు..లోతు సొదొమ గొమొర్రాలను(పాపంతో నిండిన) పట్టణాలను కోరుకొని, అబ్రామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.(ఆది 13:7,11)
తరువాత రోజుల్లో.. అబ్రాహము దేవుణ్ణి ఇలా ప్రాధేయపడ్డాడు- “ఒకవేళ సొదొమలో పదిమంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చెయ్యవు కదా?” (ఆది18:32)
అబ్రాహము దేవుణ్ణి అలా వేడుకోవడంలో అతని ఉద్దేశం ఏంటి? లోతు కుటుంబం మాత్రమే కాకుండా, అతనితో పాటు ఉన్న పనివారు కూడా దేవునిలో ఉంటారని..కానీ లోతు పనివారు సొదొమ ప్రజలతో పాటు లోకంలో కలిసిపోయారు. లోతు ఈ లోకపు కోర్కెల వైపు పరుగెత్తాడు, కానీ సరైన ఆత్మీయ నాయకుడిగా (తన ఇంటికి, తనతో ఉన్న వారికి) ఉండలేకపోయాడు.
దేవునికి అక్కడ పదిమంది నీతిమంతులు కూడా కనిపించలేదు. కనుక దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేసాడు. దేవుడు అబ్రాహము ప్రార్ధనను బట్టి లోతు కుటుంబాన్ని మాత్రమే కాపాడాడు.
అబ్రాహము తనతో ఉన్నవారిని ప్రార్ధనాపరులుగా(కుటుంబం), దేవుని చేత నడిపించబడేవారిగా(ఎలియాజరు), విశ్వాస యోధులుగా(పనివారిని) తయారుచేశాడు.
నీవు కోరుకునే సహవాసాన్ని బట్టి, ఇష్టపడే (వాటిని) నాయకుడ్ని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని అంచనా వేయ్యవచ్చు. దేవుణ్ణి ప్రేమించే సహవాసాన్ని, దేవునిపై ఆధారపడే దైవ నాయకత్వాన్నే మనం కోరుకోవాలి.
నీవే నాయకుడవైతే, నీ భక్తి జీవితం నీతో పాటు ఉన్నవారి పై(కుటుంబం పై) ప్రభావం చూపుతుందని మర్చిపోవ్వదు.
నీవే నాయకుడవైతే, నీ భక్తి జీవితం నీతో పాటు ఉన్నవారి పై(కుటుంబం పై) ప్రభావం చూపుతుందని మర్చిపోవ్వదు.
Comments
Post a Comment