“వెంటనే ఆ కన్యకలందరూ నిద్రలేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు.తెలివిలేని కన్యలు ‘మా నూనె అంతా అయిపోయింది! మా దీపాలు ఆరిపోతూ ఉన్నాయి!’.....అంతట తలుపు మూయబడింది.ఈ మాటలతో యేసు తన శిష్యులను హెచ్చరించాడు.(మత్తయి 25:8,11)
సాతాను ఆది నుండి దొంగ,(దేవునిపై ఉన్న విశ్వాసాన్ని,దేవునిలో నిలిచివుండటాన్ని) దోచుకొనువాడై ఉన్నాడు. విశ్వాసిని తిరిగి లోకంలోకి తీసుకు వెళ్ళాలనే వాడి ప్రయత్నాలు. వాడు తిన్నని మార్గాలను చెరుపువాడు.విశ్వాసే వాడి ప్రథమ గురి.
లోకంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? లోకంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు(యాకోబు 4:4).
విశ్వాసి మరళా లోకస్నేహనికి తిరిగినప్పుడు, దేవుని ఆత్మ దుఃఖపడతాడు. విశ్వాసం సన్నగిల్లుతుంది. దేవుని క్రియలు పోతాయి. లోకం ఏలుతుంది. క్రియలులేని విశ్వాసం వ్యర్థం కాదా!
"దేవుని ఆత్మను ఆర్పకండి"(1థెస్స 5:19).
అలా కఠిన పర్చుకొన్నప్పుడు విశ్వాసి విశ్వసభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు .
అలా కఠిన పర్చుకొన్నప్పుడు విశ్వాసి విశ్వసభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు .
ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు, దైవ సందేశం యొక్క మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళుపడిపోతే, వాళ్లు తిరిగి మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. (హెబ్రీ6:4-8)
బైబిల్ ఈ స్థితిని గుర్చి హెచ్చరిస్తుంది.(యూదా1:12,హెబ్రీ 3:15, మత్తయి18:32-34).కొన్నిసార్లు మనం ఆ స్థితిలో ఉన్నాం, అని గుర్తించలేకుండా కూడా ఉండొచ్చు.(న్యాయ16:20). కాబట్టే పౌలు చివరి దినాల్లో- "విశ్వాసము కాపాడుకొంటిని"(2తిమోతి 4:7) అని చెప్పాడు.
యేసు-
"ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే అతడు తీగెలాగా పారవేయబడి ఎండిపోతాడు. అలాంటి తీగెలను మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. అవి కాలిపోతాయి."(యోహాను15:6)
"ఆ రోజు గానీ, గడియ గానీ మీకు తెలియదు, గనుక మెళుకువగా ఉండండి.!!" (మత్తయి 25:13)
విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు క్రీస్తుకు మనల్ని మనం అప్పగించుకొంటూ, విశ్వాసంలో, కృపలో నిలిచివుందాం.

Comments
Post a Comment