ఒక పొద మధ్యలో మంటల్లో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతూ ఉంది గానీ అది కాలిపోలేదు.(నిర్గమ 3: 2,3)
అగ్ని లక్షణం దేనినైనా దహిస్తే గాని అది మండదు. దేవుడు ఈ లోక సహజ నియమాలకు అతీతుడు. దేవుడు తన పిల్లల్ని కూడా అసాధారణమైన పరిస్థితులగుండా నడిపిస్తూ ఆయన శక్తిని కనపరచుకుంటాడు.
ఏ నరుడు తన(జ్ఞానం) లో నుండి దైవశక్తిని అంచనా వేయకూడదు. ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఆయనను ఆయనే కనపర్చుకుంటే తప్ప ఎవ్వరు ఆయనను తెలుసుకోలేరు. ఆ ఆసక్తిని కలిగిన ప్రతి ఒక్కరూ దీనిని పొందుతారు. బైబిల్ తెలియటం వేరు, దేవుణ్ణి (వ్యక్తిగతంగా) తెలుసుకోవడం వేరు. దీనినే దేవుని ప్రత్యక్షత అని అంటారు. అంటే దేవున్ని తమ సొంత అనుభవాలతో తెలుసుకోవటం. మోషే తరువాత రోజుల్లో దేవుడు సర్వోన్నతుడని దేవుని శక్తిని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుకున్నాడు.
దేవుడు మోషేతో -“నీవెందుకు నాకు మొరపెట్టుకొంటున్నావు?ముందుకు సాగిపోండి" అన్నాడు..మోషే సముద్రంవైపు చెయ్యి చాచాడు; దేవుడు సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి దాన్ని ఆరిన నేలగా చేశాడు.
నేడు మన జీవితాల్లో కూడా దేవున్ని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుకోవాలి. ఇలా లేకుండా ఉంటే,అంత్య దినాన నీవెవరో నాకు తెలియదు అని దేవుడంటే ఆశ్చర్యపోవద్దు.
Comments
Post a Comment