పిలాతు(రోమాన్ గవర్నర్)-"యూదుల రాజైన నజరేయుడగు యేసు" అను వ్రాత వ్రాయించి సిలువ మీద పెట్టించాడు.(యోహాను 19:19)
పిలాతు యేసును రాజు గా విశ్వసించే ఆ పలక వ్రాయించాడా? ఆ మాట నిజంగా అతను నమ్మినట్లైతే రాజు ఎక్కడ ఉండాలి? ఆయనకు గౌరవం ఎక్కడ?
క్రీస్తు గవిని (నగరం ద్వారం) వెలుపట శ్రమపొందెను.(హెబ్రీ 13:12). సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు.ఆయనను చేతులతో కొట్టారు.(యోహాను 19:2,3)
క్రీస్తు గవిని (నగరం ద్వారం) వెలుపట శ్రమపొందెను.(హెబ్రీ 13:12). సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు.ఆయనను చేతులతో కొట్టారు.(యోహాను 19:2,3)
పిలాతు మనుష్యులను సంతోషపరచిగోరి ఇదంతా చేశాడు.అతని మాటలకు క్రియలు పూర్తి విరుధ్ధంగా ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసం మృతము. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తన విశ్వాసాన్ని క్రియలతో రుజువుచేశాడు. యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు తెగించి, పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాడు.(మార్కు 15:43)
ఒకవేళ ఆయనే దేవుడని నీవు చెప్పొచ్చు కానీ, నీ విశ్వాసం క్రియరూపంగా రుజువు చేయబడుతుందా? లేదంటే పిలాతు నమ్మకమే నీ నమ్మకం అవుతుంది. దేవుడు ఆయనను అభిమానించమని చెప్పలేదు కానీ అనుసరించమని చెప్పాడు.
యేసు--"ఎవడైనను నన్ను వెంబడింప కోరినయెడల తన్నుతాను నిరాకరించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను అనుసరించాలి"(లూకా 9: 23).
మనం ఆయనను అనుసరిస్తున్నవారమైతే ఆయనను ద్వేషించిన లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటె సాతాను ఎప్పుడు దైవికమైన వ్యక్తులకు విరోథి.
Comments
Post a Comment