స్తెఫను(పరిశుద్దాత్మ చేత నింపబడిన శిష్యుడు)
కొందరు స్తెఫను మీదికి వచ్చి అతణ్ణి పట్టుకొని మహాసభ దగ్గరకు తీసుకువెళ్ళారు.అక్కడ అబద్ధ సాక్షులను నిలబెట్టి నిందలు మోపారు.సభలో కూర్చొన్న వారంతా అతనివైపు తేరి చూస్తూ ఉంటే అతని ముఖం దేవదూత ముఖంలాగా వారికి కనిపించింది.
స్తెఫను-"తలబిరుసుగా ఉన్న మనుషులారా! వంచని మెడగలవారలారా, మీ పూర్వీకులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? వారిలాగా మీరు కూడా ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు."
ఈ మాటలు విని సభ వారు కోపంతో మండిపడి అతణ్ణి చూచి పటపటా పండ్లు కొరికి నగరం బయటికి అతణ్ణి గెంటివేసి రాళ్ళతో కొట్టి చంపేశారు.
పరిశుద్దాత్మ చేత నింపబడినవారు, దేవుని ఆత్మకు లోబడి, దేవుని మనస్సు కలిగి ఆయన వలె ప్రవర్తిస్తారు. భక్తిహీన ప్రజలు, నామకార్ద క్రైస్తవులు, దేవునికి లోబడని విశ్వాసులు వారిని(పరిశుద్దాత్ముని) ద్వేషిస్తారు,ఎదిరిస్తారు. మారుమనస్సు కోసం దేవుడిచ్చే అవకాశాలను కాలదన్నుతారు .
నీవు పరిశుద్దాత్ముని చేత నింపబడుతూవున్నావా(అప్పగించుకొనటం)? ఐతే స్తెఫను పొందిన గుర్తులు నీ జీవితంలో కన్పిస్తాయి.
Comments
Post a Comment