❇ దేవుడు-"మేలు కీడు తెలిపే చెట్టు పండు మాత్రం తినకూడదు.నీవు దాన్ని తినే రోజున తప్పక చస్తావు"
అదే ఫలం గురించి పాము(సాతాను) హవ్వతో-“మీరు చావనే చావరు.ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!’ అంది.(ఆది 2:17,3:4) ❇
కోరహు-"సమాజంలో ఉన్నవాళ్ళంతా పవిత్రులే.వారిలో ప్రతి ఒక్కరూ మంచి వారు.యెహోవా వాళ్ళందరిమధ్య ఉన్నాడు".
అదే ప్రజల గురించి దేవుడు మోషే అహరోనులతో-“ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు.(సంఖ్యా 16:3,20)
✔ సాతాను స్వరం ఎప్పుడూ తీయ్యగా, ఆ పనుల కూడా మనస్సుకి ఎంతో సంతోషాన్ని, సుఖాన్ని కలిగించేవిగా ఉంటాయి. దేవుని కంటే ప్రేమగల మాటలు ఒలికిస్తాడు. బైబిల్లో ప్రతి చోట సాతాను ఉపయోగించిన విధానం ఇదే. కాని వాడు(వాడి సంబంధులు) నీ ఆత్మకు చేటు చేసేవారని మర్చిపోవద్దు. చివరికి అది నీ దేవుని సహవాసాన్ని, ఆయన ఉద్దేశాలను దొంగిలిస్తాయి.
✔ పిల్లల్ని మోసం చెయ్యడం మోసగాళ్లకు చాలా సులభం. అది దేవుని స్వరమో, అపవాది స్వరమో గుర్తించాలి. మొదట మాటల కంటే, ఆ మాటల వెనక ఉద్దేశాన్ని గ్రహించాలి. ప్రతి ఆత్మనూ నమ్మొదు,ఆ ఆత్మలు దేవునికి చెందేవో కావో పరీక్షించి చూడాలి(1యోహాను 4:1). మనం బుద్ధిలేని పిల్లలవలె ఉండకూడదు గాని, ఆత్మీయ పిల్లలుగా ఆ పేరుకు తగినట్లుగా ఆత్మ దేవుని అనుసరించి మేలైన వాటి మీద మనస్సు కలిగిన వారమై వివేచనతో నడుచుకుందాం!
Comments
Post a Comment