"సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన కంటికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం లెక్కఅప్పచెప్పవల్సివుంటుంది"(హెబ్రీ 4:13)
ఇశ్రాయేలు ప్రజలు అపజయం అంటూ ఎరుగక, ప్రతిసారి యుద్ధంలో విజయం పొందేవారు.అలాంటిది హాయి అనే చిన్న పట్టణం పై ఘోరంగా ఓడిపోయారు. కారణం..శపితమైన ఆ పట్టణం నుంచి ఎమీ తీసుకురాకూడదని,దాన్ని నాశనం చెయ్యమని దేవుడు ముందుగానే చెప్పాడు.(ఇది అవిధేయులపై దేవుని తీర్పు).
కానీ, ఆకాను అనే వాడోకడు శపితమైన వస్తువుల్లో కొన్నింటిని దాచిపెట్టుకున్నాడు. వాడు మనుషులు చూడకుండా జాగ్రత్త పడ్డాడు. కాని దేవుని కంటికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయని గుర్తించలేకపోయాడు. ఎందుకు ఓడిపొయ్యారో కారణాన్ని దేవుడు నాయకునికి చెప్పాడు.లక్షలమంది ప్రజల్లో కూడా దేవుడు అతణ్ణి రహస్య పాపాన్ని బయటపెట్టి, శిక్షించాడు. సరిగ్గా ఇలాగే మనుషులందరికి దేవుడు తీర్పుతీర్చే రోజున జరుగుతుంది .
క్రీస్తు శిష్యుడైన యోహాను-"నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి (దేవుణ్ణి) చూసాను. నేను చనిపోయిన వాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథంకూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయిన వాళ్ళపై తీర్పు చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద తీర్పు చెప్పబడింది"(ప్రకటన 20:11,12). ఈ మాటలు సత్యం, నిజంగా జరుగుతాయి.
ఐతే క్రీస్తు మనకి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు మన పాపానికి శిక్షని తానే సిలువపై భరించాడు. ఆయన రక్తంలో కడుగబడిన పాపాన్ని లెక్కలోనికి తీసుకురానని దేవుడే వాగ్దానం చేశాడు. కాబట్టి క్రీస్తులో ఉన్నవారే(విశ్వాసించిన వారే) రక్షణలోకి వస్తారు.
Comments
Post a Comment