ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు. కాని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు 4000 మంది సైనికులను చంపివేశారు.
అప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు-"షిలోహులో ఉన్న యెహోవా మందసాన్ని ఇక్కడికి తెప్పిద్దాం. అది మన మధ్య ఉంటే అది మనల్ని శత్రువుల బారినుంచి కాపాడుతుంది”
యెహోవా మందసం యుద్ధ శిబిరంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులంతా సంతోషంతో పెద్దగా కేకలు వేశారు. ఆ సంగతి తెలుసుకొని ఫిలిష్తీయులకు భయం వేసింది.
ఐనా ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేయగా, ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఒక్కొక్కరుగా తమ డేరాలకు పారిపోయారు. యుద్ధంలో పెద్ద వధ జరిగింది. 30,000 మంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు. దేవుని మందసం చెర పట్టబడింది.(1సమూ 4:1-11)
ఇదే దేవుని మందసంతో వారి పితరులు అనేక యుద్ధాలు చేసి వీరోచితంగా గెలిచారు. దేవుని సన్నిధి వారితో రాగా, ఆయనే వారి పక్షాన పోరాడాడు. అసాధారణ కార్యాలు జరిగించాడు.
కాని విశ్వాసంతో ఉన్న వీరు ఇప్పుడెందుకు ఇలా ఓడిపోయ్యారు?
వీరి పితరులు దేవుని దగ్గర విచారణ చేసి, దేవుడు పంపగా యుద్ధానికి వెళ్లేవారు. ఇక్కడ పెద్దల పెత్తనం, వారి మాట దేవుని స్థానాన్ని ఆక్రమించింది. వారి పెద్దలు మతసంభంధంగా ఆలోచిస్తున్నారు, కాని దేవునిపై ఆధారపడినవారు కాదు. పూర్వికులు తయారు చేసిన మందసం వారితో ఉంది కాని పూర్వికులను నడిపిన దేవుడు వారితో లేడు. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కాని దానిలోని దేవుణ్ని తెలుసుకున్నవారు కారు. పితరులు అనుసరించిన విధానాలు, అనుభవాలు పూర్తిగా మారిపోయ్యాయి. వారు ఇతర దేవతలను పూజించట్లేదు కాని నిజ దేవుణ్ని అనుసరించాల్సిన విధానానికి మనసు ఇచ్చినవారు కాదు. కాబట్టే శక్తిగల మందసం తమతో ఉన్నా, ఆ శక్తి ప్రభావం వారితో లేదు (1సమూ 5).
నేడు అందరి చేతిలోని బైబిల్ ఒక్కటే! కానీ భక్తి ఒక్కటి కానట్లే,
స్వచ్ఛత(సరైన సిద్దాంతాలు) చేతిలో ఉన్నంత మాత్రాన, దాని ప్రభావం అనుభవిస్తున్నవారము కాకపోవచ్చు. పితరులు ఇచ్చినవి వారు అనుభవించి, దేవునితో నడచి ఇచ్చినవి. నేడు అవి ధ్యానించి, భోధించడానికే పరిమితమౌతున్నాయి కాని వారి జీవిత అనుభవాలు, వారి భక్తి తీవ్రత ఏమాత్రం మనలో ఉన్నవి కావు.
మందసం చూసి కేకలు వేసి సంబరపడి మనుష్యుల ముందు డాంబికాలు పలకొచ్చేమో, కాని దేవుని ముందు కాదు. భక్తి దైవశక్తిగా మార్చబడడాల్సివుంది. వాక్యము దేవునిది కనుక మనం అవిధేయులుగా ఉన్నా దానికి శక్తి ఉంటుంది కనుక ఇతరుల జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. జీవజల ఊటలు మనలో నుండి కాక మనపై నుండి వెళ్తే ఏమి ప్రయోజనము. మనం వట్టి వారిగా మిగిలిపోతాము(సంఖ్యా 20:10,12)

Comments
Post a Comment