దేవుని మాట వినకుండా పతనమైపోతున్న ఇశ్రాయేలు గూర్చి ప్రవక్తయైన యిర్మీయా చెప్పిన భవిష్యద్ వాక్కు.
"నేను భూమివైపు చూశాను. అది శూన్యంగా, రూపం లేని స్థితిలో ఉంది. నేను ఆకాశంవైపు చూశాను.అక్కడ వెలుగు లేదు.."(యిర్మీ 4:23)
ఆదిలో సాతాను దేవుని పై తిరుగుబాటు చేసి, పడిపోయినప్పుడు, వాడు భూమి మీద పడిన తర్వాత,వాడి మూలంగా చెడిపోయిన భూమి స్థితితో యిర్మీయా పోల్చుతున్నాడు.(యెహె 28:14-18, యెషయా 14:12-15, 45:18, ఆది 1:2)
ఇది (పాపాన్ని ప్రేమిస్తూ) దేవుని మాటను తిరస్కరిస్తూ, ఆయనపై తిరుగుబాటు చేస్తున్న వారి హృదయానికి గుర్తుగా ఉంది. చెడిపోయిన దానిని దేవుడు ఎప్పుడూ కట్టే వానిగా ఉంటున్నాడు.
ఆదిలో నిరాకారంగా ఉన్న భూమికి అందమైన ఆకారాన్ని ఇచ్చాడు (ఆది 1:3).
శత్రువుల చేత పాడుచేయబడిన ఇశ్రాయేలును, చెరశిక్ష నుండి విడిపించి, మళ్ళీ పునఃనిర్మిస్తానని వాగ్దానం చేశాడు (యిర్మీ 33:7).
నేడు దేవుని మాటను పెడచెవి పెట్టి తిరుగుతున్న వారు, దేవుని తట్టు తిరిగితే, నూతన స్థితిని(మొదటి స్థితిని) అనుగ్రహిస్తానని మాట ఇస్తున్నాడు(లూకా 19:10).
ఇప్పుడు ఉన్న స్థితి ఎంత చెడిపోయి ఉన్నా, దేవుని పాదాల చెంత మనకు ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంటుంది. అవును! నీకు అసాధ్యమే ఈ స్థితిని మార్చడం, కాని దేవునికి కాదు. సృష్టిని అందంగా మలచిన దేవుడు, నీ జీవితం మార్చలేడా? దేవుడు సమర్థుడు!! నీవు నమ్మితే, ఆయన చేతిలోకి వస్తే దేవుని గొప్పకార్యాలు నీ జీవితంలోనూ చూస్తావు.

Comments
Post a Comment