Skip to main content

14 June 2017

గేత్సేమనే వనంలో యేసు మోకరించి ఇలా ప్రార్థన చేసాడు- "తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి"(లూకా 22:43)
■ ఆయన తొలగించుమన్న పాత్ర ఏమిటి? శిలువ శ్రమా?లేక శరీర మరణమా?
● ఆయన కష్టాలను, శ్రమల గూర్చి భయపడుతూ,ఈ మాటను అనుంటే గనుక, "లోకంలో మీకు శ్రమ కలుగుతుంది..మీరు సిలువను మోస్తూ నన్ను వెంబడించండి" అని ఆయనకు చెప్పే అర్హత ఉండదు.
● లేదు శరీర మరణం గూర్చి ఈ మాటలు చెప్పిఉంటే, నేడు ఆయన కోసం అంతకంటే ఘోరంగా చంపివేయబడ్డ అనేక మంది హతసాక్షుల కంటే తక్కువ వానిగా కనిపిస్తాడు. చివరికి పాత నిబంధనలోని షడ్రక్, మేషాక్, అబేడ్నోగులు సంతోషంగా దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన వారికంటే లోక రక్షకుడు తక్కువైనవాడవుతాడు.
●నిజానికి ఆయన ఎన్నడూ దూషణలను,శ్రమలను,నిందలను, చివరికి ప్రాణాన్ని కూడా లెక్కచెయ్యలేదు. ఆయన మరణించడానికే వచ్చాడని, ఆ సమయం ఎప్పుడో, ఏలాంటి మరణం పొందుతాడో, ఆయన్ను అప్పగించువాడేవాడో ఆయనకు బాగా తెల్సు. పేతురు ద్వారా సాతాను మరణాన్ని దూరం చెయ్యాలని చూస్తే ఆయనే సాతాన్ని గద్దించాడు. ఆయన్ను పట్టుకునే వారికి ఆయనే ఎదురూ వెళ్ళి, అప్పగించుకొన్నాడు.
"యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు,తనను మరణము నుండి రక్షించగలవానికి గట్టి ఏడుపులతో, కన్నీళ్ళతో ప్రార్థనలూ విన్నపాలూ అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడాయన విన్నపం విన్నాడు." (హెబ్రీ 5:7)
● మరి ప్రభువు ప్రార్ధించిన "మరణము" ఏమిటి?
ఏదేను వనంలో పాపం చేస్తే నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పాడు, అది శరీర మరణమా? కాదు. శరీర మరణం ఆదికాండం 3:17లో శాపంగా వచ్చింది. పండు తిన్నవెంటనే వారు ఆత్మీయంగా చనిపోయారు.మరణం అంటే ఎడబాటు అని అర్ధం. దేవునితో,ఆయన సహవాసంతో ఎడబాటు. అప్పట్నుంచి ప్రతి మనిషిని ఈ ఆత్మీయ మరణం ఎలుతుంది. క్రీస్తు లోకరక్షకునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఎన్నడూ పరలోక తండ్రితో ఎడబయలేదు.కానీ సిలువలో లోకపాపంగా, శాపంగా చేయబడిన క్రీస్తును, దేవుడు వదిలివేయబోతున్నాడు. అంటే ఆత్మీయ మరణం. ఆయనతో ఎడబాటును క్రీస్తు తట్టుకోలేకపోతున్నాడు. అది కూడా నీతిమంతుని కోరికే, కాబట్టి ఆయనలో ఏ పాపంలేదు. ఐతే అనేకుల రక్షణార్థం ఆవిధంగా చేయాల్సి వచ్చింది.ఆ మరణం నుండి తప్పించి తిరిగి (బ్రతికింపగల) లేపగలవానికి, పైన చెప్పిన విధంగా ప్రార్ధించాడు. దేవునితో సహవాసం విషయంలో, ఆయన మాట వినడంలో క్రీస్తు మనకు మంచి మాదిరి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...