Skip to main content

26 May 20117

హోషేయ అనే దైవజనుడు(ప్రవక్త), ఒక వేశ్యను పెండ్లి చేసుకొన్నాడు. అప్పటికే ఆమెకు ఒక ప్రియుడు ఉన్నాడు. ఇంకా రహస్యంగా తన వ్యభిచారం కొనసాగిస్తూనే ముగ్గురు పిల్లల్ని కన్నది. తన పిల్లలు కాదని తెల్సినా హోషేయ వారిని ప్రేమతో చూశాడు. తన ప్రేమను అర్థం చేసుకొని, తన భార్య మారాలని ఎంతో ఎదురు చూశాడు...

హోషేయ లాంటి భక్తిపరుడు, పవిత్రుడు, ఇలాంటి స్త్రీని పెండ్లి చేసుకోవడమే గొప్ప త్యాగం! ఇంకా తనకు నమ్మకద్రొహం చేస్తున్న ప్రేమిస్తూనే ఉన్న హోషేయ మంచితనం చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆ స్త్రీ పై కోపం వస్తుంది. నిజానికి హోషేయ స్థానంలో దేవుడు ఉన్నాడు, ఆ స్త్రీ స్థానంలో మనం ఉన్నాము.

అపవిత్రతో, అసహ్యమైన పనులతో బ్రతుకుతున్న మన పట్ల, పరిశుద్దుడైన దేవుడు కృప చూపి ప్రేమిస్తుంటే, ఆయన నుండి సకల మేలులు, వనరులు పొందుకుంటున్న మనం ఆయనను చులకనగా చూస్తూ,ఆయన ప్రేమను పట్టించుకోకుండా ఉన్నా, తన అపారమైన ప్రేమతో ఇంకా ప్రేమిస్తునే ఉన్నాడు. మనస్సు మార్చుకొని ఆయన ప్రేమను అర్ధం చేసుకోవాలని నీ సృష్టికర్త నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

మన స్వేచ్ఛలో నుండే మంచిని (దేవుణ్ణి) కోరుకోవాలి. అంటే దేవుణ్ణి విడచి తిరుగుతున్న ఈ జీవితం నుండి దేవుని వైపు తిరిగి, నీ హృదయం ఆయనకు ఇవ్వడం!తీర్మానం చెయ్యడం!! ప్రేమగల పరలోక తండ్రీ, నీ పాప క్షమాపణకై ఆయన ప్రియ కుమారుణ్ణి(యేసుని) శిలువపై బలిగాను, దానంగాను ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన పవిత్ర రక్తంలొనే నీ పాప విమోచన ఉంది. నీవు విశ్వసించిన వెంటనే అది నీకు వర్తిస్తుంది. క్రీస్తులో నిన్ను దాచి, తీర్పులో నుండి తప్పించి, నీతో సహవాసం చెయ్యాలని దేవుని ఉద్దేశ్యం. ఇలా దేవుడు నీ పట్ల ఆయన ప్రేమను తెలియజేస్తూన్నాడు. నీ మొదటి ప్రేమను దేవునికి ఇస్తావా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...