Skip to main content

23 June 2017

హోషేయ--"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం!ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం రండి! ఆయన్ని అనుసరిద్దాం రండి!"(హోషేయా 6:1,3)

"దేవుని గూర్చిన జ్ఞానం అంటే, వాక్యం తెలియడం, దానిని చక్కగా విభజించడం కాదు. అది అందరికి తెలపడం అంతకంటే కాదు(మత్తయి 7:22,23). బైబిల్లోని దేవుని అనుభవాల ద్వారా వ్యక్తిగతంగా తెలుసుకోవడం,అవును అని మన జీవితల్లో రుజువు చేసుకోవడం. ఆయన చేత మనం గుర్తించబడటం!"

 ఇశ్రాయేలీయులు దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు బుద్ధిహీనమైన పనులు చేశారు(హోషేయా 4:1,2). సృష్టికర్తను విడచి లోకంతో స్నేహం చేశారు. ఐగుప్తు(పాపపు) బానిసత్వం నుండి విడుదల పొంది, కృతజ్ఞతరహితులై ఇష్టపూర్వకంగా ఈ లోకప్రజల విధానాలకు మరలి పోయారు. మొదట చేసిన నిబంధనను మరిచారు.

 గద్దించాల్సిన యాజకులు వారి బాధ్యతను మరచి(హెబ్రీ 13:17), దేవుడు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వదిలివేశారు. వారి కడుపే వారి దేవుడయ్యాడు(హోషేయా 4:6-8).కాబట్టి వారు కూడా దేవుని శిక్షకు పాత్రులుగా ఎంచబడ్డారు(4:9).

 ఎఫ్రాయిము తెగను దేవుడు ఎంతో ప్రేమించాడు. దానిని గూర్చి ఉన్నతమైన ఉద్దేశ్యలను కలిగి ఉన్నాడు(ఆది 48:17-19, యిర్మీయా 31:20).కాని ఆ ప్రజలే మరి ఎక్కువగా దేవుని దుఖః పెట్టారు. విగ్రహాలతో కలిసి పోయి దేవుని శిక్షకు సిద్ధంగా ఉన్నారు(హోషేయా 5:9,11).

 కాబట్టి దేవుడు ఇశ్రాయేలను,యూదాను,ఎఫ్రాయిమును మరియు బెన్యామీనుకు గాయం చేసి, తానే మరలా బాగు చేసి, వారిని పాపం నుండి వారిని మరల్చాలని కోరుకున్నాడు. కాని ఎఫ్రాయిము, మనుష్యులను ఆశ్రయించి ఆ శ్రమ నుండి బయటకి రావాలని ఆశించారే కాని దేవుని దగ్గర కు మరలిన వారు కాదు.
ఆ సమయంలో హోషేయ ఇస్తున్న పిలుపు ఇది-"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం..ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం".

దేవుడు-"నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు" (హోషేయా 4:6), జ్ఞానము అంటే అక్షరం కాదు(దానికోసమైన ప్రాకులటకు వెళ్లొద్దు). ఆయన ఆత్మ ద్వారానే దైవ జ్ఞానం తెలియజేయబడుతుంది.మనం తీసుకొంటున్న ఆత్మీయ ఆహారం మనకు బలంగా మారాలి, లేదంటే పరిసయ్యుల జీవితంలా మారిపోతుంది.

 "దేవుని గూర్చిన జ్ఞానము మనకు తెలిసినప్పుడు, మన గురించి మనకు సరిగ్గా తెలుస్తుంది"

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...