Skip to main content

27 June 2017

ఆదిమ సంఘంలో దేవుణ్ని నమ్మినవారంతా ఏక మనసుతో ఉన్నారు. భూములైనా ఇండ్లయినా ఉన్నవారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.
అయితే అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకొని, కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

పేతురు-"అననీయా, నీ భూమి ఖరీదులో కొంత దాచుకొ
ని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! నీవు మనుషులతో కాదు దేవుని తోనే అబద్ధమాడితివి"
అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు.


 అపొస్తలులు దేవుని పరిశుద్ధాత్మచే నింపబడి,ఆత్మ ద్వారా నడిచే వ్యక్తులు. అననీయ దేవుని సన్నిధిని చులకనగా చూశాడు, నటించాడు. మనుష్యుల ముందు నటిస్తున్నానని అనుకున్నాడు కాని దేవుని సన్నిధిని గుర్తించలేకపోయ్యాడు. దేవుణ్ని హృదయపూర్వకంగా అనుసరించే ఉద్దేశ్యంలేని వారు, దేవుని హస్తం బహు బలంతో పనిచేసే చోట/వ్యక్తులకు దూరంగా ఉండటమే శ్రేష్ఠము. అపొస్తలుల వంటి రగిలే సంఘములో ఉండి, ఇలాంటి జీవితం జీవించి ప్రాణాలు కోల్పోయాడు. భక్తిలేని, దేవుని ఆత్మ బలంగా పని చెయ్యని మరొక సంఘంలో ఉన్నట్లే అననీయ బ్రతికి ఉండేవాడు. నేడు సంఘాల్లో భక్తిహీనులు ఇలాగే బ్రతికేస్తున్నారు.

 ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి అత్యంత దగ్గరగా జీవించేవారు, మరి ఎక్కువ ప్రమాదానికి దగ్గరగా ఉన్నవారు(బుద్ధిపూర్వకంగా అవిధేయులైనప్పుడు).
అహరోను కుమారులు(లేవి 10:1), ఏలి కుమారులు(1సమూ 2:22), ఉజ్జా(2సమూ 6:7), ఉజ్జియా(2దిన 26:19), ఇస్కరియోతు యూదా(మత్తయి 26:24) జీవితాలు.
వీరంతా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి దగ్గరగా ఉన్న మనుష్యులే కాని అవిధేయులు. కాబట్టే వారందరూ దేవుడు శిక్షలోకి వెళ్లారు.

 అంటే పాపము చెయ్యనివారే దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలా? కాదు! పాపాన్ని చులకనగా తీసుకొననివారుగా, పాపంతో పోరాడేవారుగా ఉండాలి! దేవుడు బలహీనుడ్ని, అవిధేయుడ్ని వేరుగా చూస్తాడు.

 బలహీనతలో పోరాటం ఉంటుంది(పాపమునుండి బయటకి రావటానికి). పాపంలో పడినప్పుడు దుఃఖం ఉంటుంది. దేవుని సన్నిధిలో గోజాడటం ఉంటుంది. వారు దేవుని రూపంలోకి క్రమేపి మారతారు. అట్టి వారికి దేవుడు సహాయకుడు.

 అవిధేయతలో దేవుని పట్ల చులకనితనం, కప్పిపుచ్చుకోవటం, సమర్ధించుకోవటం, దేవుని పరిశుద్ధులతో పోరాటంలాంటివి ఉంటాయి. అలాంటి వారు దేవుని వైపు తిరగరు. వీరు దైవవిరోధులు.

🕎 నీ పాప బలహీనతలో పోరాటం ఉందా? దేవుని పరిశుద్ధతని మనఃపూర్వకంగా ఆపేక్షిస్తున్నావా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...