Skip to main content

29 June 2017

దేవుని మాటను బట్టి, ఆయనిపై విశ్వాసం ఉంచి ముందుకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ లోకానికి వెఱ్ఱివారిగా కనబడతారు.
దేవుని మాటను బట్టి 
★ ఓడను కట్టిన నోవహు
★ గమ్యం తెలియకనే ప్రయాణం చేసిన అబ్రాహాము, 
★ఇశ్రాయేలీయులను యెఱ్ఱసముద్రం వైపు నడిపిన మోషే 
★300 మందితో గొప్ప సైన్యం మీద యుద్దానికి వెళ్లిన గిద్యోను
★విగ్రహానికి మొక్కని షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు
★ స్తుతిగానాలతో యుద్దానికి వెళ్లిన యెహోషాపాతు
★ జీవనోపాధిని వదిలేసి, క్రీస్తును వెంబడించిన శిష్యులు
★ శిలువ సాక్షిగా మారిన పౌలు ఇలాంటి వారే.

● విశ్వాసంగల వారు దేవుని ఉనికిని స్పష్టంగా చూడగలరు. ఆయన మాటకు తల వంచి విధేయులౌతారు. లోకం దీన్ని గ్రహించలేదు. కాబట్టే వీరు లోకానికి వెఱ్ఱివారిగా కనబడతారు.

దానితో పాటుగా ఆయన చేత ఏర్పాటుచేయబడిన వారు ఇలాంటి వారు.
◆ దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి, లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
◆ బలవంతుల్ని సిగ్గు పరచడానికి, లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
-- గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచుల్నీ, మనుషులు తిరస్కరించిన వారినీ, ఎన్నిక లేనివారినీ దేవుడు ఎన్నుకున్నాడు" (1కోరింధీ 1:28,29)

ఈ విధంగా వారు మరి యెక్కువ మూర్ఖులుగా కనిపిస్తారు. మునుపు బుద్ధిహీనులు, మూర్ఖులు, నీచులు, తెలివితక్కువ వారుగా ఉన్న వారిలో ఒక్క రోజులో(ఒక్కసారిగా) మార్పు జరగదు. దినదినం జరిగే రూపాంతరం అందరూ కనిపెట్టలేరు గనుక దైవత్వం బుద్ధిహీనుల శరీరంలో నివాసిస్తుందని వారు గుర్తించలేరు. లోకసంబంధులు, బలహీనతలనే కళ్ళ ముందు ప్రాధాన్యంగా నిలుపుకునే బలహీనులైన విశ్వాసులు, ఇట్టి వారిని త్రోసిపుచ్చుతారు. కాని ఇలాంటి వారి ద్వారానే దేవుడు తన ఉద్దేశాలను సఫలపరుస్తాడు.

ఆ విధంగానే నాటి మత గుంపు దేవుణ్ని, ఆయన నిజ సేవకులను గుర్తించలేకపోయింది(మార్కు 3:22, అపో 4:13).
రక్షకుని గుర్తులను(ప్రవచనాల నెరవేర్పు) కనిపెట్టలేనంతగా గ్రుడ్డివారయ్యారు. యధార్థతలేని వారి కళ్ళకు దేవుడు గ్రుడ్డితనాన్ని ఈ విధంగా కలుగజేస్తాడు(రోమా1:26,28).వారి సమస్య విశ్వాసంతో నడిచే విశ్వాసితో కాదు, గాని దేవునితో, ఆయన సంబంధంతోనే!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...