❇ దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో-"అననీయా" అని పిలిచాడు.
అతడు -"చెప్పండి, ప్రభూ!" అన్నాడు.
ప్రభువు -"నువ్వు లేచి, 'తిన్నని వీధి' అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరివాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి, అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు"
అననీయ -"ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేము లోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు. ఇక్కడ కూడా నీ పేరున ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకులనుండి అధికారం పొందాడు"
అందుకు ప్రభువు-"నీవు వెళ్లు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను" ❇
✔ దేవుణ్ని తెలుసుకోక ముందు సౌలు(పౌలు) ఎంతో కఠినుడిగా, హంతకునిగా, హానికరునిగా ఉన్నాడు. ఈ సంఘటన ముందు వరకు కూడా అతని జీవితం అదే! ఎప్పుడైతే దేవుణ్ని తెలుసుకున్నాడో అతని అంతరంగం మారిపోయింది. దేవుని మనస్సులోని అతని గూర్చిన అభిప్రాయం కూడా మారిపోయింది.
✔ మన కళ్ళ ముందు ఎదుటివారి తప్పుడు జీవితం గూర్చిన భావనలే మెదులుతుంటాయి (చివరికి వారు ఆ మార్గం నుండి తొలగినా కూడా). దేవునితో నడిచే వ్యక్తి తన అభిప్రాయాన్ని, సౌలును సమీపించిన అననీయ వలె మార్చుకుంటాడు. విశ్వాసి దేవుని చూపుతో మనుష్యులను చూడటం మొదలైతే, మనుష్యులు పూర్తిగా మార్పుచెందగల దైవరూపంలో నిర్మిచబడ్డారని గ్రహిస్తారు(2కోరి 5:17). మునుపు క్రూరుడుగా ఉన్న పౌలు, 'తర్వాత రోజుల్లో అనేక తరాలకు క్రీస్తు మాదిరిని చూపించడం కోసం దేవుడు చేసిన ఎంపిక' అని ఎవ్వరు గుర్తించగలరు?దేవునితో సహవాసం ఉన్నవారే! విశ్వాసికి అనుగ్రహించబడిన దేవుని కృపను, వారి పట్లనున్న దేవుని ఏర్పాటును గ్రహించాల్సివుంది. ఇది ఆధ్యాత్మిక పెద్దలుగా (వయస్సులో కాదు) ఉండేవారిలో కనిపించాల్సిన విషయాలు.
✔ అననీయ వలె దేవుని మనసు కలిగి, నీ అభిప్రాయాన్ని దేవుని అభిప్రాయం వలె మార్చుకోవడానికి ఇష్టపడతావా? అలావున్నప్పుడే దేవుడు నిన్ను వాడుకొంటాడు. ఆయన మనసు కలిగిన వారే ఆయన ఉద్దేశ్యాలను నెరవేర్చగలరు. దేవుని మనస్సు ప్రేమతో ముడి పడి ఉంది. ఆయన పరిచర్య (వివిధ రకములైన) మనుష్యుల మధ్యలో ఉన్నది. ఆయన దృష్టితో చూడకుండా మనమెన్నడూ వారిని గెల్చుకోలేము.
↪ మన సంభాషణల్లో, ఫోన్లో, చాటింగుల్లో మనుష్యులను గూర్చి చెడుగా మాట్లాడుకునే జిహ్వ చపలత్వాన్ని వదులుకొని, విను వారికి మేలు కలిగే శ్రేష్ఠమైన విషయాలతో మనల్ని మనం ప్రోత్సాహంచుకొందాం! దేవుడు నన్ను, నిన్ను అలా చేయును గాక!

Comments
Post a Comment