దేవునికి అవిధేయుడైన యోనా చేప కడుపులో నుండి ఇలా ప్రార్థన చేశాడు- "నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను.. ఆయన నా ప్రార్థన ఆలకించాడు! యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది!"
దేవుని కృప వల్ల బయటకి వచ్చి, దేవుని మాట ప్రకారం నినెవే వెళ్ళాడు. నినెవే ప్రజలను దేవుని వాక్కును బట్టి హెచ్చరించగా, పాపాత్ములైన నినెవే పట్టణస్తులు పశ్చాత్తాపడి, మారుమనస్సు పొందారు.దేవుడు నగరాన్ని రక్షించటం పట్ల యోనాకు కోపం వచ్చింది.యోనా యెహోవా పట్ల చిరాకుతో ఇలా అన్నాడు:
“ఇది జరుగుతుందని నాకు తెలుసు! ఈ దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు అప్పుడే తెలుసు. వీరు పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు.నీవు కరుణ చూపిస్తావని, నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! కావున యెహోవా, నన్ను చంపివేయుమని నేను నిన్ను వేడుకుంటున్నాను!"
దేవునికి ఇంత దగ్గరగా ఉండి(దైవ జ్ఞానం కలిగి ఉండి), కొన్ని రోజుల క్రితం బుద్ధిపూర్వకంగా అవిధేయుడైన యోనా దేవుని కరుణ కోసం వేడుకుంటే, దేవుడు మన్నించి బ్రతికించాడు. కాని దేవుని వెలిగింపులేని నినెవే ప్రజలకు దేవుడు కరుణ చూపిస్తే ఓర్వలేకపొయ్యాడు. దేవుని చేత క్షమించబడి ఇతరులను క్షమించలేని వారికి యోనా గుర్తుగా ఉన్నాడు. దేవుని మనస్సులేని దేవుని పరిచర్య వల్ల ఏమి ప్రయోజనం. అదంతా శూన్యమే కదా!
ఏ పాపం చేయని యేసయ్య, పాపం చేసిన వారందరి పట్ల కృప చూపుతున్నాడు(రోమా 11:32).కాని పాపం చేసి, క్షమాపణ పొందుకున్న మనం ఎదుటివారి దోషాలను లెక్కించే పనిలో నిమగ్నమౌతున్నాము.(కొందరికి ఇదే పెద్ద పరిచర్య. క్రీస్తు పరిచర్య అంతా పరిసయ్యులను, శాస్త్రులను విమర్శిస్తూ, గద్దిస్తూ ఉండలేదు. పరిచర్య ఇంకా చాలా ఉంది. నిందిస్తూ, విమర్శించడమే పరిచర్య ఐతే, ఆ పరిచర్యలో సాతాను చాలా బిజీగా ఉన్నాడు. నువ్వు వాడితో జతకట్టాల్సిన అవసరం లేదు). కృప తొలగిపోతుంది. క్రీస్తు ఏమి చేసినా అందులో కృప ఉంటుంది(చివరికి గద్దింపుతో సహా).
మనం క్షమాపణ పొందుకున్నాం. కనుక మనం ఖచ్చితంగా ఎదుటివారికి ఇవ్వాల్సివుంటుంది. లేదంటే క్షమాపణ తీసివేయబడతుంది(మత్తయి 18:23-35).
క్షమించపోతే ఆయన కూడా మనల్ని క్షమించడు(పరలోక ప్రార్థన). అలాంటి అర్పణను/ఆరాధనను ఆయన అంగీకరించడు(మత్తయి 5:24).మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. మన ముందొక మాదిరి ఉంది. మనం ప్రేమించినా,కృప చూపినా, బుద్దిచెప్పినా, గద్దించినా, శిక్షించినా..నశించువారిని/అవిధేయులను దేవుని కృపలోనికి తేవడమే మన ఉద్దేశ్యం అయి ఉండాల్సివుంది.
Comments
Post a Comment