ఇస్కరియోతు యూదా:
★ యేసు ఎంతో ప్రార్దనా పూర్వకంగా ఇస్కరియోతు యూదాను శిష్యునిగా ఎంపిక చేశాడు.ఇది పరలోక తండ్రి చిత్తం. ఖచ్చితంగా యూదా మొదట్లో భక్తిపరునిగా కనిపిస్తున్నాడు. (లూకా 6:12,13,16)
★ యూదా దయ్యాలను వదలగొట్టాడు,స్వస్థతలు చేశాడు, సువార్తనూ ప్రకటించాడు.(మత్తయి 10:1,4)
★ యేసు శిష్యులందరి విశ్వాసం తొలగిపోకుండా కాపాడాడు. యూదాను తప్ప(యోహాను 17:12). యూదా దేవునిలో నిలిచి ఉండక తన ఇష్టపూర్వకంగా తొలగినట్లు కనిపిస్తుంది. దేవుడు పక్షపాతికాడు.యూదా మెల్లిమెల్లిగా లోకంలోకి దిగజారి అపవాదికి తనను తాను అప్పగించుకొన్నాడు.
★తండ్రియైన దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన వ్యక్తిలోకి సాతాను ప్రవేశించగలిగాడు.(మత్తయి 10:20, యోహాను 13:27).శుభ్రపరచబడిన హృదయం మళ్ళీ ఖాళీ ఐతే, మరి ఎక్కువ కీడు సంభవిస్తుంది(మత్తయి 12:43-45)
★ ఒకప్పుడు దేవుని పరిశుద్ధ స్థలంలో నిలిచిన దేవదూత, పాపం చేసినప్పుడు కృపను కోల్పోయి పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. దేవుని చేత ఏదేనులో నిల్పబడిన ఆదాము పాపం చేసినప్పుడు, గెంటివెయ్యబడ్డాడు. యూదా పరిస్థితి అంతే! వారే కాదు, ఆయనలో నిలిచి ఉండని వారు, ఆయనతో పాలినవారుకారని వాక్యం చెప్తుంది.(హెబ్రీ 3:15)
★ (నిజమైన విశ్వాసం క్రియల్లోకి నడిపిస్తుంది).దేవునిపై విశ్వాసం కోల్పోతే కృపనుండి దూరం అవ్వుతారని సాతానుకి బాగా తెలుసు(ఎఫెస్సి 2:8). కనుకనే ఆదిలో (ఏదేనులో) నుండి గర్జించు సింహం వలె విశ్వాసాన్ని దొంగిలిస్తూ తిరుగాడుతున్నాడు.
క్రీస్తు యేసునందు ఉండువారికి ఏ శిక్షవిధి లేదు. కాబట్టే వాడి గురి, క్రీస్తునందు నిలిచి ఉండకుండా ప్రక్కకు తొలగించడమే!(యోహాను15:4)
క్రీస్తు యేసునందు ఉండువారికి ఏ శిక్షవిధి లేదు. కాబట్టే వాడి గురి, క్రీస్తునందు నిలిచి ఉండకుండా ప్రక్కకు తొలగించడమే!(యోహాను15:4)
Comments
Post a Comment