● ఫిలిప్పు నతనయేలును చూసి, "ధర్మశాస్త్రంలో మోషే, ఇంకా ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేం చూశాం..ఆయన నజరేతువాడైన యేసు" అని చెప్పాడు.
● అందుకు నతనయేలు-- "నజరేతులో నుండి మంచిదేమైన్నా రాగలదా?" అన్నాడు.
● ఫిలిప్పు-- "నువ్వే వచ్చి చూడు" అన్నాడు.
నతనయేలు తన దగ్గరకు రావడం యేసు చూశాడు. "చూడండి.. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు" అన్నాడు.
● నతనయేలు-- "నేను నీకెలా తెలుసు?" అన్నాడు.
● యేసు-- "ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను" అన్నాడు.
● నతనయేలు-- "బోధకుడా, నువ్వు దేవుని కుమారుడివి!.." అని నతనయేలు బదులిచ్చాడు.
నతనయేలు సత్యాన్వేషి, అంటే మనస్సులోని భావాలను యధార్ధంగా వ్యక్తపరుస్తూ, తనకు తెల్సిదే సరైనది అని మొండిగా వాదించక, సత్యం తన దగ్గరకు వచ్చినప్పుడు (తెలిసినప్పుడు) మంచి మనస్సుతో అంగీకరించువాడు.
దేవుడే అలాంటి వారిని వెతుక్కుంటూ వస్తాడు. సత్యాన్వేషి, సత్యమై ఉన్న దేవుణ్ణి దాటిపోలేడు. ఎందుకంటే దేవుడు వారికి స్పష్టంగా కనపర్చుకొంటాడు. సత్యమును అంగీకరించినప్పుడు, అబద్ధపు సంకెళ్ళు తెగిపోతాయి. ఆ సత్యమే మనల్ని తప్పుడు జీవితం నుండి విడిపిస్తుంది. మనల్ని పుట్టించిన సృష్టికర్తయైన దేవుని మాటే సత్యం. ఆ జీవితం మనలో దేవుని రాజ్యానికి (పరిపాలనకు) దారితీస్తుంది.మన జీవితానికి నిజమైన అర్థం అప్పుడే తెలుస్తుంది.
ఆయన మాటలకు వేరుగా ఉన్నదంతా అసత్యమే(పాపమే).
చీకటి పనులను ప్రేమించే వారు, దేవుని(వెలుగు)లోకి ప్రవేశించడానికి ఇష్టపడరు. నిర్జీవమైన వాటినే(చీకటినే) కోరుకుంటారు, కారణం అవి వారి తప్పులను ఎన్నడూ చూపించవు,గద్దించవు.కనుక వారు ఎటు వెళ్తున్నారో కూడా గ్రహించలేరు.వారి జీవితం భ్రమలోనే ముగుస్తుంది. దాని అంతం దేవుని నుండి నిత్య ఎడబాటు (నరకశిక్ష).

Comments
Post a Comment