సంసోను-"నేను తిమ్నాతులో ఫిలిష్తీయ జాతి అమ్మాయిని ఒకదానిని చూశాను. నేనామెను పెళ్లి చేసుకుంటాను" అన్నాడు.
అతని తల్లిదండ్రులు-"మన బంధువులలో గానీ, మన ప్రజలందరిలో గానీ అమ్మాయి లేదనా, 'సున్నతి పొందని(భక్తిలేని)' ఫిలిష్తీయ జాతి అమ్మాయిని పెండ్లాడతానంటున్నావు?” అని అతనితో చెప్పారు. కాని సమ్సోను-"ఆ స్త్రీని నా కోసం తీసుకురండి.ఆమె నాకు నచ్చింది".(న్యాయ 14:3)

తర్వాత రోజుల్లో..
సంసోను గాడిద దవడ ఎముకను చేతపట్టుకొని దానితో వెయ్యిమందిని ఫిలిష్తీయులను హతమార్చాడు.అప్పుడు అతనికి బాగా దప్పికయ్యింది.
"నీ సేవకుడైన నా చేతితో ఈ గొప్ప విడుదల ప్రసాదించావు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి, ఈ 'సున్నతి పొందని(భక్తిలేని)వాళ్ళ' చేతులకు చిక్కుపడాలా?" అని యెహోవాకు ప్రార్థన చేశాడు.(న్యాయ 15:15,18)

సంసోను విలువైన నిర్ణయాల్లో, సొంత నిర్ణయాలు చేశాడు(దేవుణ్ణి అడగలేదు). తన అవసరాల్లో మాత్రం దేవునికి మొఱ్ఱపెట్టాడు. సున్నతిలేని వారితో చనిపోవడానికి ఇష్టపడలేదు, కాని ఆ జాతి స్త్రీని పెండ్లాడేటప్పుడు అతనికి సున్నతి గుర్తురాలేదు. ఇలా ప్రవర్తించినందుకు సంసోను భారీ మూల్యం చెల్లించాడు.
అవసరాలకు తమకు నచ్చిన బైబిల్లోని వాక్యాలను (వాగ్దానాలను) స్వతంత్రించుకొంటూ, తన సొంత మార్గాల్లో నడిచే వారికి సంసోను గుర్తుగావున్నాడు. వాక్యం మనపై అధికారం చెయ్యాలి కాని, వాక్యాన్ని మనకు నచ్చినట్లు మలచుకోకూడదు. అంటే నేను చేస్తున్న పనికి బైబిల్లోని వాక్యం సపోర్ట్ చేస్తుందా అని వెతక్కూడదు.ఇలా చేస్తే తప్పకుండా ప్రతి తప్పును సపోర్ట్ చెయ్యడానికి వారికి ఒక వాక్యం దొరుకుతుంది.అపవాది ఇట్టే మోసం చేస్తాడు(ఇది నా స్వఅనుభవం).
యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని చదవాలి.నేను వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నానా అని చూసుకొంటూ, సరిచేసుకొని దేవుని వాక్యం క్రిందికి రావాలి.
Comments
Post a Comment