■ "దేవుని మందసం" ఒక పవిత్రమైన పెట్టె.దేవుని సన్నిధికి సూచనగా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది(అందులో దేవుని ఆజ్ఞలు గల పలకలు, మన్నా, అహరోను కర్ర ఉంటాయి).
● మందసం అబీనాదాబు ఇంటినుంచి యెరూషలేములోని రాజనగరికి తీసుకురావాలని దావీదు కోరుకున్నాడు. కనుక వారు దానిని ఒక కొత్త ఎడ్లబండి మీద ఊరేగింపుగా తీసుకొని రావలనుకొన్నారు.
● ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు. దావీదు, ఇస్రాయేల్ వారంతా తమ శక్తి అంతటితో పాటలు పాడుతూ, తంతివాద్యాలనూ కంజరీలనూ తాళాలనూ వాయిస్తూ, బూరలు ఊదుతూ, దేవుని సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు.
● నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. వెంటనే ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోవడానికి చెయ్యి చాపాడు.
దేవుడు ఉజ్జామీద తీవ్రంగా కోపగించి అతన్ని మొత్తాడు. అతడు ఆ మందసం ముందే పడి చనిపోయాడు.ఒక్కసారిగా ఆ సంబరం కాస్తా విషాదంగా మారిపోయింది.
● అప్పుడు దావీదు దేవునికి భయపడి, దారి ప్రక్కన ఉన్న ఓబేదెదోం ఇంటికి దానిని తీసుకుపోయాడు.దేవుని మందసం అతని ఇంటిలో అతడి కుటుంబం దగ్గర 3 నెలలు ఉంది. దేవుడు ఓబేదెదోం కుటుంబం వారిని, అతను కలిగివున్న అంతటినీ దీవించాడు.
■ ఒకనికి శాపంగా మారింది, ఒకనికి దీవెన ఎందుకయ్యింది?
అతి పవిత్రమైన ఆ మందసాన్ని లేవీయులు తప్ప వేరొకరు తాకకూడదు. వారే దాన్ని మోయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
◆ దేవుని వాక్య ప్రకారంగా కాకుండా చేసే భక్తి, సేవను బట్టి దేవుడు సంతోషించడు. ఒక రోజు అవి దేవుని పరీక్షకు నిలబడాల్సి ఉంటుంది. మనుష్యులు(వారు ఎంత భక్తిపరులైనా సరే), వారి అభిప్రాయాలను బట్టి కాక, దేవుని వాక్యంతోనే సరిచూచు కోవాలి. బెరియా సంఘం పౌలు బోధించినప్పుడు అదే చేశారు.
వాక్యానుసారంగా జీవించకుండా, మనంమంతా పెద్ద గుంపుగా కూడి, దేవుణ్ణి స్తుతించినా(ఖర్చు చేసినా) దేవుడు మనపై అసంతృప్తిగా/కోపంగా ఉండొచ్చు. వారి యొద్ద ధర్మశాస్త్రం ఉంది, కాని ఆ విషయంలో వాక్య ప్రకారంగా (దావీదు సైతం) ప్రవర్తించలేదు.
౼ ఓబేదెదోం(కుటుంబంగా) భయభక్తులతో, దేవుని వాక్యనుసారంగా మందసాన్ని చూశాడు. కనుకనే దీవించబడ్డాడు.
★ దేవుని వాక్యం దగ్గర పెట్టుకొని, మనుష్యుల మాటలకు ఆరాధికులు కాకండి. దేవుని వాక్యంతోనే ప్రతి బోధను పోల్చి చూడవాల్సివుంది. దేవునితో ఉన్నవారు, దేవుని స్వరాన్ని గుర్తుపడతారు.మన అంతిమ గురి దేవుని సంతోషపరచడమే!

Comments
Post a Comment