Skip to main content

11 July 2017

దావీదు-"నా దేవా, నా రాజా నిన్ను నేను స్తుతిస్తాను. నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను. ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను. ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను"(కీర్తనలు 145:1-5)

 మనం ఆయనను అంగీకరించినా, అంగీకరింపక పోయినా మనమంతా ఆయన గొప్ప (సౌర్వభౌమ) అధికారానికి లోబడవాల్సినవారమే! (లోబడినవారమే!)
 మనం ఎప్పుడు పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? ఎవరికి పుట్టాలి?ఎంతకాలం బ్రతకాలి? మన రంగు, రూపు, ఎత్తు మొద౹౹ నిర్ణయించినది ఆయనే! మన శరీరంలోని ప్రతి అవయవాలను,వాటి పనులను, వాటిలోని జ్ఞానాన్ని, మన తెలివితేటలను కలుగజేసింది ఆయనే!
 మనం నిలుచున్నా, కూర్చొన్నా, అగాధం వంటి కటిక చీకట్లో దాక్కోన్నా కూడా దేవునికి అంతా స్పష్టమే! ఆయన సమస్తము స్పష్టంగా చూడగలడు. మన ముందు తరాలను చూచినవాడు. మనం పుట్టక మునుపే, మన రాబొయ్యే తరాలను, వారి పనులను చూడగలవాడు, భూత భవిష్యత్ వర్తమానాలను ఏకకాలంలో చూడగల వాడు ఆయనే!
 సృష్టంతటి మీద సర్వాధికారం గలవాడు. గాలిని, భూమిని, సముద్రాలను ఆయన ఆధీనంలో ఉంచుకొనివున్నాడు. భూమి, అందులోని సమస్తం ఆయన సొత్తు! ఆయన చేతి వ్రేలితో పంచభూతాలకు ఆజ్ఞ ఇవ్వగలవాడు. సమస్త జీవరాసుల ఆకలిని తీర్చువాడు ఆయనే. ప్రతి జీవరాశి ఆయన ఆజ్ఞను గుర్తించును, వాటి భాషను ఎరిగినవాడు ఆయనే! కౄర జంతువులను సాధుజీవులుగా కూర్చొన బెట్టువాడు,
అలలను రేపువాడు, నిమ్మలపర్చువాడు ఆయనే!
 ప్రతి పరిస్థితులపై సింహాసనాసీనుడుగా కూర్చొన్నవాడు. అధికారుల మనస్సును త్రిప్పగలవాడు. దీనులకు సమీపస్తుడై ఆశ్రయ దుర్గముగా నిలుచువాడు. వారిని హెచ్చించువాడునూ, గర్విష్టులను త్రోసివేయువాడునూ ఆయనే. దుష్టుడు(సైతాను) సైతం ఆయన అనుమతి లేకుండా ఎవ్వరిని ముట్టలేడు. పరలోక, భూలోక, పాతాల లోకాలపై సంపూర్ణ అధికారి.
 యుగయుగముల నిత్య నివాసి ఆయనే! మన నిరీక్షణకు ఆధారం, విమోచన గొర్రెపిల్ల దాత, నిత్య సహవాసానికి ఎన్నికలేని దరిద్రులను పిలచువాడు. సంపూర్ణుడు, సర్వాధికారి, ఆకాశమందు బలిష్టుడు, యుగయుగములకు స్తోత్రాహుడు మహిమ స్వరూపుడైన త్రియేక దేవుడు.
 ఆ గొప్ప దేవుడు అన్ని కాలాల్లో స్తోత్రాహుడై ఉన్నాడు. ఆమెన్! 

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...