కరువు సమయంలో యోసేపు అన్నలు కనాను నుండి ఐగుప్తుకు బయలుదేరారు.చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు తమ తమ్ముడైన యోసేపును, గోతిలో పడేసి చంపాలను కొన్నారు. ఐతే దానినుండి బయటకు తీసి ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు. ఇప్పుడు అదే ఐగుప్తుకు వెళ్తున్నప్పుడు, యోసేపు ఇప్పుడు ఎలా ఉంటాడని అనుకొనివుండొచ్చు?
✔ బానిసల్లో ఒకడిగా దయనీయమైన జీవితం జీవిస్తూ ఉంటాడని జాలిపడి, బాధపడి ఉండొచ్చు.
🔸 కాని దేవుడు యోసేపును ఐగుప్తు సామ్రాజానికి గొప్ప అధికారికంగా చేశాడు. కరువు కాలంలో అందరిని కాపాడే రక్షకునిగా నియమించాడు. అది ఆయన అనాది కాల సంకల్పం.(ఆది 15:13,14)
➡ సమూయేలు ఏలి కి పరిచారం చేస్తున్న రోజుల్లో, ఏలి సమూయేలు భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించివుండొచ్చు?
✔ తన కుమారులు, వారి సంతానం యాజకులుగా ఉంటే, వారి దగ్గర పరిచారకులుగా సమూయేలు, అతని సంతానం ఉంటారని ఊహించి ఉండొచ్చు.
🔸కాని దేవుడు సమూయేలుని తర్వాత న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా నియమించాడు. ఇది అతను పుట్టకముందే దేవుడు చేసిన ఎంపిక.
⏺ మనుష్యులు మన గురించి ఎన్నో దయనీయమైన అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాని మనల్ని నిర్మించిన సృష్టికర్తకే తెలుసు, మనం దేని కోసం సృష్టించబడ్డామో! మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా తెలియజేసి, వాటి గుండా నడిపిస్తాడు.
⏺ దేవుడు వాడుకున్న అపొస్తలులు లోకంలో ఇలా ఉన్నారు.
పౌలు-"ఈ గడియ వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాము, దిగంబరులము; పిడిగుద్దులు తింటున్నాము. నిలువ నీడ లేకుండా ఉన్నాము. సొంత చేతులతో కష్టపడి పని చేస్తున్నాము. నిందింపబడినా దీవిస్తున్నాము. హింసింపబడినా ఓర్చు కొనుచున్నాము. దూషింపబడినా బతిమాలుకుంటున్నాము ఇప్పటివరకూ మేము ఇతరుల దృష్టిలో లోకంలోని చెత్తాచెదారంలాగా, అన్నిట్లో నీచమైనదానిలాగా ఎంచబడ్డాము" (1కోరింథీ 4:12,13)
"నీ కోసం(దేవుని కోసం) దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడనున్న గొఱ్ఱెలవలె ఉన్నాం" (రోమా 8:36)
కాని దేవుడు వారిని(మనల్ని) రాజులుగాను, యాజకులుగాను చూస్తున్నాడు (1పేతురు 2:9,ప్రకటన 5:10).
💠 మన విలువ దేవునిలో ఉంది, మనుష్యుల ఆలోచనల్లో కాదు
💠

Comments
Post a Comment