దేవుడు సీనాయి పర్వతం మీదకు మోషేను పిలిచాడు.మోషే అక్కడ నలభై పగళ్ళూ నలభై రాత్రులూ ఉండిపొయ్యాడు.మోషే రావడం ఆలస్యం కావడం ప్రజలు చూచి..
అహరోనుతో- "చూడు! మా ముందర వెళ్ళడానికి ఒక దేవుణ్ణి మా కోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్‌దేశంనుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు" అన్నారు.
అప్పుడు ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు మరియు ఒక బలిపీఠం నిర్మించాడు."రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ" అని చెప్పాడు.
అప్పుడు ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు మరియు ఒక బలిపీఠం నిర్మించాడు."రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ" అని చెప్పాడు.
ఒక్క దైవికమైన నాయకుడు(మోషే) అక్కడ లేకపోవడాన్ని బట్టి అప్పుడు గొప్ప నాశనం జరిగింది. దేవుణ్ణి పోలిన (దేవునితో నడిచే) ఒక్క వ్యక్తి చాలు, గుంపును దైవికంగా నడిపించడానికి.
ప్రజల మెప్పు కోసం కాక(వారికి భయపడక), దేవుణ్ణి సంతోషపెట్టే నాయకత్వమే శ్రేష్ఠమైన నాయకత్వం. ఇలాంటి నాయకత్వాన్ని సహజంగానే ప్రజలు కోరుకొరు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. తమకు నచ్చినట్లు ప్రవర్తించే నాయకుడ్నే , దేవుణ్ణే (మాట్లాడలేని విగ్రహన్ని) మనుష్యులు కోరుకుంటారు. విశాల మార్గానికి పొయ్యెవారు అనేకులు. దానికి నడిపించే నాయకులంగా మనం ఉండకూడదు.(విశ్వాసుల గూర్చి చెప్తున్నాను)

పౌలు ఎఫెస్సు సంఘం పెద్దలతో-"నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళలాంటి వారు మీమధ్యలో ప్రవేశిస్తారని నాకు తెలుసు" అన్నాడు(అపో 20:27) . అప్పటి వరకు పౌలు దేవుని సంఘానికి కావలివాడి వలె కాపాడుకొన్నాడు. దేవుణ్ణి ప్రేమించినవాడు శ్రేష్ఠమైన వాక్యంతో, ఆయన మందను చక్కగా మేపుతాడు.(యోహాను 21:15)
ఏలాంటి నాయకునిగా (ఈ ఒకేఒక్క జీవితంలో) నీవు దేవుని ముందు ఉండాలనుకుంటున్నావ్? అనేకులు దేవుని మార్గం నుండి తప్పిపోవడానికి కారణమైన (అహరోను)నాయకత్వం లాగా?మార్గం తప్పి తిరుగుతున్న వారిని సరైన దారిలో నిలిపే మోషే/పౌలు లాగా?
Comments
Post a Comment