పౌలు-"నేను ఏ స్థితిలో ఉన్నా ఆస్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకొన్నాను." (ఫిలిప్పీ 4: 11)
లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి.ధనవంతుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.
ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు(పరదైసుకు) తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు.
అబ్రాహాము బ్రతికి ఉన్న రోజుల్లో గొప్ప ధనవంతుడు.లాజరు దరిద్రుడు. వీరిద్దర్నీ ఒకచోట చేర్చింది వారికి దేవునిపై ఉన్న విశ్వాసం.
లాజరు కడు బీదరికంలో, జబ్బులతో ఉన్నా ఎన్నడూ దేవుని తిట్టలేదు, ఎవ్వరితో తన స్థితిని పోల్చుకోలేదు. చివరికి దిక్కులేని చావును పొందినప్పటికీ, తన అంతిమ స్థితి దేవుని చెంతేనని విశ్వాసం కలిగి జీవించాడు.దేవుడు ఉంచిన ప్రతి పరిస్థితితుల్లో నమ్మకంగా దేవుణ్ణి సేవించాడు.
అబ్రాహాం తన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. దేవుని ముందు ధనాన్ని గడ్డిపరకతో సమానంగా ఎంచాడు. జరగటానికి ఎలాంటి అవకాశాలు లేని వాటిని దేవుడు వాగ్దానం చేస్తే, నిస్సందేహంగా నమ్మి, వాటికోసం ఎదురుచూశాడు. అతను ఎంతో ఇష్టపడినవారిని దూరంచేసి దేవుడు పరీక్షించాడు. అయినా తన మొదట స్థానం దేవునిదే! అని పనుల ద్వారా రుజువు చేసాడు. అన్నిటి కంటే, అందరి కంటే దేవుణ్ణే అమితంగా ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నా, శాశ్వితమైన (పర)లోకం మీదే దృష్టి పెట్టాడు.
ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవించారు.వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశం కోసం వెతుకుతుండే వాళ్ళని అనిపిస్తుంది.వారు కోరినది ఈ లోకం కంటే శ్రేష్ఠమైన దేశం అంటే పరలోక దేశం.
"తాను వారి దేవుణ్ణనిపించుకోవడానికి దేవుడు కూడా ఏమీ సిగ్గుపడట్లేదు" (హెబ్రీ11:16)
"కనిపిస్తున్నవి కొంత కాలమే ఉంటాయి.కానీ కనిపించనివే శాశ్వతమైనవి" (2కోరింథీ4:18)
దేవుడు మనల్ని ఉంచిన స్థితిలో నుండే ఆయన్ను నమ్మకంగా సేవించాలని కోరుతున్నాడు. ఇప్పుడు నీవున్న స్థితి దేవుని వల్ల కలిగినదే..ఒకవేళ భవిష్యత్ లో ఈ స్థితి తారుమారైనా మారని దేవుడు మనతో ఉంటాడు కనుక పైన చెప్పిన భక్తుల వలే ఈ యాత్రా జీవితంలో దేవుణ్ణి నమ్మకంగా సేవిద్దాం!

Comments
Post a Comment