ఒక గొఱ్ఱె జీవిత అనుభవం.
"రోజులాగే నా కాపరి, మేత కోసం అడవికి తీసుకెళ్లాడు.బాగానే మేపుతాడు.. కాని నాకు నచ్చినట్లు కాదు. అందమైన పచ్చిక కనిపిస్తూవుంటే అక్కడకు వెళ్ళిద్దని గద్దిస్తాడు. అమాయకపు గొఱ్ఱెలు, నేను కాకుండా ఇంకో 99 వుంటాయనుకుంటా! ఆయన వెంబడే స్వేచ్ఛ లేకుండా తిరుగుతుంటాయి.
"ఈ రోజు ఎలాగైనా నా స్వేచ్ఛ కోసం పోరాడి తీరాల్సిందే!" అని ఆ అందమైన ఆ చోటికి, మనసు లేని నా కాపరి కన్నుగప్పి వెళ్ళాను. ఆహ్! దగ్గర నుండి ఎంతో అందంగా, నా కన్నులకు ఇంపుగా, రుచిగా..చాలా చాలా బాగుంది!. ఇప్పటిదాకా ఇంత ఆనందాన్ని నా కాపరి దొంగిలించాడని, ఒక్కసారి కాపరి మీద చెప్పలేని కోపం వచ్చింది.
అంతలో ఏదో శబ్దం!! నాలాగే మరొక స్నేహితుడేమో, అనుకోని స్నేహ హస్తాన్ని ఇవ్వాలని చూశాను. ఓహ్! అది తోడేలు. అయ్య బాబోయ్! దొరికితే అంతే సంగతులు. కిక్కురమనకుండా ఆ పొదల చాటున నక్కాను. కొంత సేపటికి అది వెళ్ళిపోయింది. ఊపిరి పీల్చుకున్నాను. చీకటి పడొస్తుంది. అంతలో ఇంకోసారి శబ్దం అయ్యింది. బాబోయ్!! ఈసారి పెద్ద పులి! భయమేసి మళ్ళీ నక్కాను. అంతలో చీకటిపడింది.
అప్పుడు అర్ధమైంది నా కాపరి నన్నెందుకు ఇక్కడికి పంపలేదు అని.నా తోటి స్నేహితులు జ్ఞాపకం వచ్చి కన్నీరు పెట్టుకున్నాను.ఇప్పటికే వాళ్లంతా ఇంటికి వెళ్ళేఉంటారు.నా కాపరిని అపార్ధం చేసుకున్నందుకు నాకీ శిక్ష సరైందే! అనుకున్నాను.
సరిగ్గా ఆ సమయానికి..ఎక్కడనిచో ఒక స్వరం..నాకు బాగా తెలిసిన స్వరమే!...నా కాపరి నా కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు. చీకటిని, అపాయాన్ని లెక్క చేయకుండా పరుగు లేడుతూ వస్తున్నాడు.నా హృదయ కరిగిపోతుంది. ఇక చావే శరణ్యం అనుకొన్న నాకు, మళ్ళీ ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపించింది. నేను గట్టిగా రక్షించమని కేకలు వేశాను. నా శత్రువుతో పోరాడే నా కాపరి ఉన్నాడుగా..ఇక నాకేం భయం.
నా స్వరం విని కాపరి నా వైపు వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆయుధంతో ప్రాణాలకు తెగించి పోరాడి శత్రువును తరిమి వేశాడు. గాయాలతోనే నన్ను తన గుండెలకు హత్తుకొన్నాడు. నన్ను ఏమీ అనలేదు, పైగా ముద్దుపెట్టుకొని ఆయన భుజాలపై పెట్టుకొని సంతోషంతో పాటలు పాడుకొంటూ తీసుకెళ్లాడు.
ఆ గొఱ్ఱెవు నీవే! ఆ కాపరి నీ పరలోక తండ్రి!
నీవు ఇప్పుడు ఎంత తప్పుడు మార్గంలో ఉన్నా అసహ్యించు కోకుండా నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. సిలువలో నిలువెల్లా గాయాలతో నిన్ను కాపాడటం కోసం తన ప్రాణం పెట్టేంత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు.

Comments
Post a Comment