Skip to main content

1 June 2017

మతాధికారులు యేసు మీద నేరం మోపాలని వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన ఒక స్త్రీని ఆయన దగ్గరకి తీసుకొని వచ్చారు. వాళ్లు-"మన చట్టం ప్రకారం ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీవేమంటావ్?!"

యేసు వంగి వ్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు.వారు పట్టు విడవకుండా అడుగుతూనే ఉన్నారు.అప్పుడు యేసు-"మీలో ఏ పాపం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు!" అన్నాడు.

ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరగా అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. యేసు తలెత్తి చూస్తూ, “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ?నిన్నెవ్వరూ శిక్షించలేదా?” అని అడిగాడు.

యేసు ఆమెను "అమ్మా!" అని పిలిచాడు.ఒకవేళ ఆమెకు పిల్లలు ఉన్నట్లయితే ఆ సమయంలో అలా ఆమెను పిలిచుండేవారు కాదేమో!.ఈ మాటతో దేవుడు పాపాత్ముల పట్ల ఆయన (ప్రేమా) వైఖరిని తెలిజేస్తున్నాడు. పాపం చేసి, ఏ మాత్రం అర్హత లేని మనకు క్రీస్తులో ఉన్న గొప్ప నిరీక్షణ చూడండి! ఇది దేవుని కృప. ఆయన మంచితనం.(విశ్వాసి ఈ కృపను ఎన్నడూ మరువకూడదు)

దేవుడు ఎల్లప్పుడూ బలహీనులై, కృంగిన వారి పక్షాన నిలబడతాడు. భూమి మీద నడిచిన అత్యంత నీతిమంతుడు(పరిశుద్ధుడు), పాపిని ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. వారి పనులను ఏ మాత్రం చూడకుండానే, ఎవ్వరి పోలికన వారున్నారో దానిని బట్టి ప్రేమిస్తున్నాడు. (ఆయన పిల్లలు ఆయనని పోలి నడవాలని ఆజ్ఞ ఇస్తున్నాడు)

ఐతే ఆయన (సువార్తను)ఇక్కడితో ముగించలేదు. అనేకమంది మంది సువార్తికులు(క్రైస్తవులు) ఇక్కడతో ముగించేస్తారు.

యేసు ఆమెతో-"వెళ్ళు! ఇక నుండి పాపం చెయ్యకు!" అన్నాడు.

దేవుని గొప్ప కనికరంతో సువార్త అయిపోలేదు కాని, పాపం నుండి మరలాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు.(నీవు ప్రకటించే సువార్తలో ఈ సంపూర్ణత ఉందా?). నేడు విశ్వాసులూ ఈ కృప వరకే చూసి ఆనందిస్తున్నారు. కాని మిగితా సత్యాన్ని నిర్లక్యం చేస్తున్నారు. పౌలు&అపొస్తలలు తమ పత్రికలలో ఈ విషయాన్ని ఎన్నో సార్లు హెచ్చరించారు. సిలువ కృప పాపం చెయ్యడానికి లైసెన్స్ కాదు. పాపం నుండి మరలాలని నీకు చెప్పే సంకేతం. పాపం యెక్క తీవ్రత! పాపంపై దేవుని ఉగ్రత అని మరవకూడదు. సిలువ పాప క్షమాపణ కోసమేనా?లేక పాప విమోచన(విడుదల) కోసం కూడానా?తిరిగి పాపపు కాడి క్రింద చిక్కుకుంటే సిలువకు అర్థమేంటి?
దినదినం దేవుణ్ణి చూస్తూ, క్రీస్తుయేసు లోని కృప ద్వారా బలం పొందుకుంటూ విజయం పొందే క్రైస్తవుడు సిలువ కార్యం తన జీవితంలో వ్యర్థం కాలేదని తెలియజేస్తాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...