ఒకరోజు చిన్నవాడైన యాకోబు వంట వండుతున్నాడు. పెద్దవాడైన ఏశావు అప్పుడే వేటకు వెళ్ళి చాలా అలసిపోయి వచ్చాడు.
ఏశావు యాకోబుతో- “నేను చాలా అలసిపొయ్యాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు" అన్నాడు .
యాకోబు- "నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని నాకు అమ్మివేయి, అప్పుడు ఇస్తాను"
ఏశావు- “ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను. జన్మహక్కు నాకెందుకూ?”
యాకోబు- “ఐతే! మొదట నాకు ప్రమాణం చెయ్యి”.
ఏశావు యాకోబుకు ప్రమాణం చేసి తన జన్మహక్కు అతనికి అమ్మివేశాడు.
అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి లేచి తన దారిన వెళ్ళాడు" (ఆది 25:29-34)
ఈ సంఘటనను ఏశావు చాలా చులకనగా తీసుకున్నాడు. కాని దేవుడు అలా తీసుకోలేదు. దైవ గ్రంథంలో ఆత్మీయ భ్రష్టత్వానికి సూచనగా వ్రాయించాడు. జ్యేష్ఠత్వం(మొదటి వానిగా పుట్టడం) మనం కోరుకుంటే కలిగేది కాదు, అది దేవుడు నియమించేది.
ఆ కాలమందు జ్యేష్ఠత్వానికి ఎంతో విలువ ఉండేది. దేవుని కృపకు గుర్తుగా క్రొత్త నిబంధనలో పోల్చబడింది.
" దేవుని కృప నుండి, మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్తపడండి...లైంగిక అవినీతిని సాగించేవారు కానీ, ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేనివాడు/భక్తిహీనుడు కానీ, మీలో లేకుండా జాగ్రత్తపడండి.
తర్వాత రోజుల్లో ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని అతనికి దక్కింది తిరస్కారమే! అతనికి ఏమీ లభించలేదు."(హెబ్రీ 12:15-17)
దేవుడు ఇచ్చే అవకాశాలను, కృపను అల్పకాల సుఖాల కోసం కాలదన్నుకున్నట్లేతే, మనం ఆ కృప(దైవ అనుగ్రహం) నుండి తొలగిపోయ్యె అవకాశాలు ఉన్నాయని పరిశుద్ధగ్రంథం చెప్తుంది. దేవుణ్ని, ఆయన కృపను ఆలోచనాయుక్తంగా, బుద్ధిపూర్వకమైన తిరస్కరణ చెయ్యొదు. అల్పకాల భోగాలు గతించిపోతాయి కాని, దేవుని మార్గాలే నిలచి ఉంటాయి. దానిలో నిలచిన వారే రక్షించబడతారు. ఆ కృపకు, వాగ్దానాలకు వారసులౌతారు.

Comments
Post a Comment