గొడ్రాలైన హన్నా, ఆమె సవతి సూటిపోటి మాటలవల్ల ఎంతో దుఃఖపడి దేవుని మందిరానికి వెళ్లి ఒక మ్రొక్కుబడి చేసుకుంది.
"సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా! నన్ను జ్ఞాపకం చేసుకో! నాకొక కుమారుని కలుగజేస్తే, వాడ్ని జీవితాంతం నీ సేవకై విడిచి పెడ్తాను" అంది. దేవుడు హన్నా ప్రార్థనను ఆలకించి, ఒక మగబిడ్డను అనుగ్రహించాడు. ఆమె దేవుణ్ణి ఎంతో స్తుతించింది.
ఈ సంఘటన వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యలను ఆలోచిద్దాం!
దేవుడు ఒక దైవికమైన వ్యక్తిని భూమి పైకి పంపాలని ఉద్దేశించాడు. ఆ వ్యక్తి గూర్చి ఎన్నో ఆలోచనలు దేవునికి ఉన్నాయి. కాబట్టి ఎంతో ప్రార్ధనాపూర్వకంగా ఆ బిడ్డను పంపాలనుకున్నాడు. హన్నాను శ్రమలాగుండా తీసుకెళ్తూ, అత్యాశక్తితో ప్రార్ధించేటట్లు నడిపించాడు.
దేవుడు ఒక దైవికమైన వ్యక్తిని భూమి పైకి పంపాలని ఉద్దేశించాడు. ఆ వ్యక్తి గూర్చి ఎన్నో ఆలోచనలు దేవునికి ఉన్నాయి. కాబట్టి ఎంతో ప్రార్ధనాపూర్వకంగా ఆ బిడ్డను పంపాలనుకున్నాడు. హన్నాను శ్రమలాగుండా తీసుకెళ్తూ, అత్యాశక్తితో ప్రార్ధించేటట్లు నడిపించాడు.
"ఈ బిడ్డ నీ వాడే ప్రభూ!" అని దేవునికి ప్రతిష్టించే వరకు ఆ బిడ్డను పొందుకోలేకపోయింది. అంతేకాదు ప్రతిష్ఠితుడైన వానిలో ప్రార్ధనాపూర్వకంగా, దైవికంగా పెంచేటట్లు(దైవికమైన పునాది వేయునట్లు) దైవభయం గల ఆ స్త్రీకే అనుగ్రహించాడు (1సమూ 1:28,2:26). ఆయనదైన సమయంలో ఆ ప్రణాళికలను ఆ బిడ్డకు తెలియజేశాడు.
తర్వాత రోజుల్లో ఆ వ్యక్తి రాజులను నియమించే గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. అతను సమూయేలుగా పిలువబడ్డాడు. హన్నా సమూయేలుతో గడిపిన సమయం చాలా తక్కువ, కాని అతడు దేవునితో గడిపిన సమయమే(జీవితమే) ఎక్కువ. హన్నా కోరుకుంటే కాదు, కాని దేవుడు కోరుకొనే ఈ వ్యక్తిని సిద్ధం చేశాడని మనకు అర్ధమౌవుతుంది.
-- సమూయేలు గూర్చే కాదు, మనల్ని గూర్చి కూడా ఇలాగే దేవుడు గొప్ప ఉద్దేశ్యాలను కలిగి ఉన్నాడు.మన పుట్టుక తల్లిదండ్రులు ఎంపిక కాదు, కాని దేవునిదే!
-- మన బిడ్డల్ని దేవుని కోసం పెంచడం కాదు కాని దేవుని సొత్తును, నమ్మకంగా ఆయన ప్రణాళికల కోసం సిద్ధం చేయడమే!
-- పరిస్థితులను మనుష్యుల దృష్టితో చూడవచ్చు, దేవుని దృష్టితో చూడవచ్చు. దేవుని చూపుతో చూస్తే పరిస్థితులు(దేవుని వాక్యం కూడా) చాలా విభిన్నంగా కన్పిస్తాయి.
Comments
Post a Comment