-- భక్తిపరుడైన దావీదు రాజు, ఊరియా అనే సైనికుని భార్యతో వ్యభిచారం చేసి, అతనిని చంపించి, అతని భార్యని పెండ్లి చేసుకున్నాడు. ఇలాంటి తప్పుడు పని దేవుని భయంలేని వాళ్ళు కూడా చేసివుండరు.
కాని దేవుడు దావీదును గూర్చి ఇలా అన్నాడు.
"దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తను బ్రతికిన కాలమంతా దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకొంటూ, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేనికీ అవిధేయుడు కాలేదు" (1రాజులు 15:4)
తర్వాత అతని సంతతి నుండి వచ్చిన అనేక మంది రాజులతో కేవలం దావీదును బట్టి వారి రాజ్యాన్ని కాపాడుతున్నానని దేవుడు చెప్పాడు.(2రాజులు 19:34)
-- పేతురు మూడున్నర సంవత్సరాలు యేసుతో ఉండి, దేవుని మాటలు చాలా విన్నాడు, అద్భుత కార్యాలూ చూశాడు. కాని ప్రభువు సిలువకు అప్పగించుకొన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదని మూడు సార్లు అబద్దమాడాడు.
క్రీస్తు మరణం నుండి లేచిన తర్వాత, అలాంటి పేతురుకు దేవుని సంఘం బాధ్యతను అప్పగించాడు. ఒకప్పుడు అబద్దమాడిన పేతురు ద్వారా, దేవునిఆత్మతో అబద్దమాడిన వ్యక్తులకు (అననీయ,సప్పీరాలకు) దేవుడు తీర్పుతీర్చాడు.
ఈ సంఘటనలు ఏమి తెలియజేస్తున్నాయి? ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని అతని బలహీనతలను బట్టి మాత్రమే దేవుడు లెక్కగట్టడు. బలహీనతల విషయంలో వారు దేవుని సన్నిధిలో పడిన పశ్చతాపం, పొందిన ఆవేదన అంతా ఇంతా కాదు. అంతేకాదు, అవి కాకుండా అతని జీవితం ఎంతో ఉంది. ఈ తప్పులు కాకుండా పై ఇద్దరి జీవితాలను గమనించండి. వారు దేవునితో నడిచిన నడక, వారు చేసిన తీర్మానాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు.
మనుష్యులు వెలి చూపులను బట్టి తీర్పు తీర్చుతారు. మానవ బలహీనత, తప్పులనే భూతద్దంలో చూస్తాము, కాని మంచిని గాలికి వదిలేస్తాము.అందుకే ప్రభువు చెప్పాడు, మంచివాడు ఒక్కడే! ఆయన దేవుడు మాత్రమే. కానీ దేవుని రూపంలో మల్చబడే విశ్వాసులు, దేవుని చూపుతో వ్యక్తులను, పరిస్థితులను చూస్తారు. ఎందుకంటే తమ జీవితాల్లో వారు ఆ కృపను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉం

Comments
Post a Comment