యేసు అప్పగిపబడబోవు రాత్రి...
పేతురు- "ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్లడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను!
యేసు అతనితో- "నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తర్వాతే ఈ రాత్రి కోడి కూస్తుందని నీకు చెప్తున్నాను"
ఆయన ఈ మాట ఎలా చెప్పగలిగాడు?
ప్రధాన యాజకుని ఇంటి ముందర, పేతురు ఆయన ఎవరో తెలియదని 3 సార్లు అబద్దమాడటం (భవిష్యత్తును) ముందుగానే చూశాడు.
అంతేకాదు..శిష్యులంతా ఆయన్ను వదిలేసి వెళ్తారని, పేతురు ఒక్కడే, ప్రాణ ముప్పు ఉన్నా తనను వెంబడిస్తాడని కూడా ఆయన ముందుగానే చూశాడు.
తన ప్రభువుకు ఏమవుతుందో అన్న ఆందోళన, మరో ప్రక్క ప్రాణభయం-- ఐనా దాగుతూ పేతురు ఆయన వెంబడే నడుచాడు. కోడి కూసేలోపే ప్రభువు చెప్పినట్లు 3 సార్లు అబద్దమాడాడు.
తక్కిన శిష్యులెవరూ ఆయనెవరో తెలియదని అబద్దమాడలేదు, అంటే పేతురు కంటే విశ్వాసంలో బలమైనవారని అర్ధమా?కాదు. పేతురు చూపిన ప్రేమకు దరిదాపుల్లో కూడాలేరని దానర్ధం. ఆ రాత్రి పడిపోయిన పేతురును అందరూ చూశారు, కాని దేవునికై పరితపించే ప్రేమ గల పేతురుని దేవుడు చూశాడు.తర్వాత రోజుల్లో దేవునిచే గొప్పగా వాడబడబోయ్యో పేతురుకి ఈ విధంగా విరగొట్టబడటం ఎంతో అవసరం.
దెబ్బతిన్న విశ్వాసికి సలహా ఇస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం..నేను ఎప్పుడైనా ఇటువంటి మార్గాన నడిచానా?నడిస్తే నిలిచానా? సమాధానం లేదు ఐతే, మౌనంగా ఉండి, అతని జీవితం నుండి నేర్చుకోవటమే ఉత్తమమైన విషయం.
విశ్వాసిలోని బలహీనతల్ని సరిచేసుకుంటూనే వారి ప్రేమను, విశ్వాసాన్ని దేవుడు మరువడు. వైఫల్యం జరిగిందంటేనే, దేవుని కోసం ముందు నిలబడ్డాడని దానర్ధం. ఒకవేళ అది ప్రేమామయుడైన దేవుని చేతుల్లో ఆ వ్యక్తి మలచబడే సమయమెమో! కొన్ని రోజుల ఆ సంఘటన తర్వాత, మరి శ్రేష్టమైన జీవితంలోకి దేవుడు అతన్ని నడిపించ వచ్చునేమో!
చివరి క్షణం వరకు మనకు నిరీక్షణ ఉంది. మన జీవితం ముగిసిన తర్వాతే కదా దేవుడు తీర్పుతీర్చుతాడు!కాబట్టి తొందరపడి తీర్పు తీర్చకూడదు. నీ ఆలోచనలోని ఆ వ్యక్తి, దేవుని ఆలోచనల్లోకి ఆ వ్యక్తి ఒకరు కాకపోవచ్చు. సంఘటనలను చూడొద్దు! ఉద్దేశ్యలను, హృదయాన్ని దైవ మనస్సుతో చూడాలి.
"నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు" అని ప్రభువు పేతురుతో ముందుగానే చెప్పాడు(లూకా 22:32)
మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువు పేతురుతో-"నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?... నా గొర్రెపిల్లలను (సంఘాన్ని) మేపు" అని అప్పగించాడు(యోహాను 21:15).
"నీవు దేవునితో నడిచే వ్యక్తివైతే దేవుని వలె ప్రవర్తించు"

Comments
Post a Comment