Skip to main content

20 June 2017

దేవుడు ఏలీయాతో-"నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని, నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చాను" అన్నాడు.

దేవుడు చెప్పినట్టే ఏలీయా చేశాడు. ప్రతిరోజూ ఉదయాన సాయంకాలాన కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి. అతడు ఆ వాగు నీళ్ళు త్రాగేవాడు. కొంతకాలానికి దేశంలో వర్షం లేక ఆ వాగు ఎండిపోయింది.

మళ్ళీ దేవుడు ఏలీయాతో-"సీదోనుల
ోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను"

● కాకులు మాంసాన్ని పీక్కు తింటాయి, కాని తెచ్చిపెట్టవు. కరువులో బీద విధవరాలు ఆహారం కోరుకుంటుంది, కాని ఇవ్వలేదు. కాని ఏలీయా దేవుణ్ని నమ్మాడు. అసాధారణ కార్యాలను ఆయన చేయ సమర్ధుడు. విశ్వాసం ద్వారానే ఆ జీవితం జీవించవల్సి ఉంటుంది.

● దేవుని మాటను విలువగా యెంచి, విధేయత చూపే వారికి, ఆయన తన చిత్తాలను(ఆయన ఆలోచనలను) తెలియజేస్తాడు. దేవుని చిత్తాలు మన జీవితంలో నెరవేరాలంటే, మొదట లోకం(మనుష్యుల) అభిప్రాయంతో సంబంధం లేకుండా జీవించడం నేర్చుకోవల్సివుంటుంది(యోహాను 7:6,7).

● దేవునితో నడవడం ఒక ప్రత్యేకమైన జీవితం, నిజమైన జీవితం. అది సవాలుతో కూడిన పని. కొన్నిసార్లు ఒంటరితనాన్ని (యోహాను 16:32), ఆగ్రహలను(అకా 7:54), అవమానాలను (1రాజులు 22:24) ఎదుర్కొవల్సి ఉంటుంది.

● దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు, ముందుగానే ఆ మార్గాలను, పరిస్థితులను, వ్యక్తులను సిద్ధపరచి సమకూడి జరిగిస్తాడు. అంటే శ్రమ, లేమి ఉండదని కాదు గాని, ఆ ప్రయాణంలో ఆయన మనకు తోడైవుండి, విశ్వాస పాఠాలను నేర్పిస్తూ, ఆయనను దగ్గరగా కనబర్చుకొంటూ, మనుష్యులను దీవిస్తూ వెళ్తాడు. మనం ధ్యానిస్తున్న దైవగ్రంధంలోని ప్రతి ఒక్క విశ్వాసవీరుడు నడచిన మార్గం ఇదే.మన జీవితంలో దేవుని మాట వినడమే మొదటి ప్రాధాన్యతైతే, ఇక ఆ గుంపులో మనం ఒకరమౌతాము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...