యూదా దేశానికి రాజు హిజ్కియా. అతడు దేవుడంటే ఎంతో భయభక్తులుగల వాడు.
సన్హెరీబు(అష్షూరు రాజు) గొప్ప సైనిక బలము గలిగి, అనేక యుద్దాలు చేసి, రాజ్యాలను జయించిన రాజు. అతడు యూదా రాజ్యం మీదికి దండెత్తి, చుట్టుముట్టాడు.
అప్పుడు హిజ్కియా-"నిబ్బరంగా ధైర్యంగా ఉండండి.అష్షూరు రాజును అతడితో ఉన్న పెద్దసైన్యాన్ని చూచి భయపడకండి. మనతో ఉన్న బలం అతడితో ఉన్న బలం కంటే గొప్పది. అతని దగ్గర కేవలం మనుష్యల బలమే వుంది. కాని మనదగ్గర యెహోవా దైవబలం వుంది. దేవుడు మనకు సహాయపడతాడు. ఆయనే మన యుద్ధాలలో పోరాడుతాడు".
అని తన ప్రజలను ధైర్యపరచాడు. అతను చెప్పిన మాటలను ప్రజలు కూడా నమ్మారు.
ఆ విషయం తెలుసుకొన్న సన్హెరీబు యూదా ప్రజలకు ఒక లేఖ పంపాడు.
దానిలో- "హిజ్కియా చేత మీరు మోసపోకండి, మీరు అక్కడే ఉండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. అతణ్ణి నమ్మకండి. ఎందుకంటే, నేను అనేక ఇతర దేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు!".
హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ లేఖ అందుకొని దానిని చదివాడు. అప్పుడతడు యెహోవా ఆలయానికి వెళ్ళి యెహోవా సముఖంలో ఆ లేఖను తెరచి పరిచాడు.
ఇలా ప్రార్థన చేశాడు-"ఆ దేశాలను అష్షూరు రాజు నాశనం చేసిన మాట నిజమే, ప్రభూ! ఆ జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కాల్చివేశారు. కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు. కాని నీవు సజీవుడవు. మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజు నుండి కాపాడు" అన్నాడు.
రాజైన హిజ్కియా మరియు యెషయా అనే ప్రవక్త ఈ సమస్య విషయంలో దేవునికి ప్రార్థించారు.
ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరములోని 1,85,000 మందిని చంపాడు. ప్రొద్దున మనుషులు లేచి చూస్తే, వారంతా శవాలుగా పడి ఉన్నారు కనుక అష్షూరు రాజైన సన్హెరీబు సిగ్గుపడి, తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు.
ఆ జీవం గల దేవుడు నేటికి సజీవుడే! ఆయన సర్వశరీరులకు దేవుడు. విశ్వసించిన వారికి సమీపంగా ఉండే దేవుడు. విశ్వాసం ద్వారా మాత్రమే ఆయన ఉనికిని స్పష్టంగా గుర్తించగలం. ఆయన వెలుగును, జీవమునై ఉన్న పరిశుద్ధ దేవుడు. షరతులు లేని ప్రేమతో(శిలువలో నుండి) నిన్ను ప్రేమిస్తున్నాడు.

Comments
Post a Comment