యేసు-" 'వ్యభిచారం చేయకూడదు', అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ(పరపురుషుని) వైపు కామంతో చూసినవారు, హృదయంలో ఆమెతో(అతనితో) వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతారు" (మత్తయి 5:28)
౼ నేను దేవునికి అవిధేయుడ్ని అవ్వాలని, ఆయనకు విరోధినై ఉగ్రతలోనికి వెళ్ళాలని, "పాపం" దేవుని ఆజ్ఞను ఆధారంగా చేసుకొని, నాలో అన్ని రకాల దురాశల్ని కలిగిస్తుంది(రోమా7:8)
౼ మీరు పాపం విషయంలో చనిపోయి, దేవునిలోబ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని, మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి..చావుకు లోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి! శరీరం యొక్క చెడ్డ కోరికలకు లోబడకండి!మీ శరీర భాగాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి..(రోమా 6:12,13)
యోబు-"ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను."(యోబు31:1)
౼ కాని నేను బలహీనమైన మనిషిని, (పుట్టుక తోనే)పాపానికి బానిసగా అమ్ముడుపోయిన(శరీరంగల) వాణ్ణి.
నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. దానికి మారుగా చెయ్యకూడదనుకొన్న తప్పునే నేను చేస్తూ పోతున్నాను.
ఈ విధంగా నాకొక నియమం కనిపిస్తున్నది. అదేమిటంటే, మంచి చేయాలని ఇష్టమున్న నాలో, చెడుతనానికి లాగే బలం పనిచేస్తుంది.(రోమా 7:14,19-21)
■ ఎందుకంటే శరీరం స్వభావము, పరిశుద్ధాత్మ కోరుకొంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టే మనం చెయ్యాలనుకుంటున్న దాన్ని చెయ్యలేకపోతున్నాం.
"కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి! అప్పుడు మీ శరీరం స్వభావం వల్ల కలిగే కోరికలు తీర్చుకోకుండా ఉండగలరు" (గలతీ 5:16,17)
★ దేవుని యందు విశ్వాసముంచడం ఒక ఎంపిక. అలాగే విశ్వసి పరిశుద్ద జీవితము జీవించడం కూడా అతని ఎంపికే, దేవుడు బలవంతం చేయడు. మనలో క్రీస్తు పోలిక(సర్వసత్యం)లోకి , మన సహాయకుడైన దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఆ జీవితంలోకి రాగలం. దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు,ఆయనే మనలో ప్రతి పాపపు ముల్లును విరిచివేస్తాడు.

Comments
Post a Comment