◆ జాలరియైన సీమోను పేతురు, అతనితో ఉన్నవారు రాత్రంతా కష్టపడినా ఒక్క చేప కూడా పడలేదు.ప్రొద్దున్నే వారు నిరాశతో తమ వలలు కడుగుతుండగా, యేసు వారి దగ్గరకు వచ్చి ఖాళీగా ఉన్న ఆ పడవను అడిగి, దానిలో కూర్చోని ప్రజలకు భోధించాడు.
ముగించిన తర్వాత ఆయన పేతురును చూచి, పడవను లోతుకు తీసుకెళ్లి వల వేయమని చెప్పాడు. పేతురు దేవుణ్ని నమ్మి అలాగే వల వేయగా విస్తారంగా చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు-"ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు" అన్నాడు.
యేసు-"భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే వాడివవుతావు! నాతో రా!" అన్నాడు. ◆
యేసు-"భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే వాడివవుతావు! నాతో రా!" అన్నాడు. ◆

అంటే దాపరికం లేకుండా, తన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునే వాడని అర్ధం. యేసు అనేకులను కలుసుకున్నాడు, అద్భుతాలు చేశాడు కాని అందరూ తమ స్థితిని యదార్థంగా ఒప్పుకున్నవారు కారు. అతి కొద్దిమంది మాత్రమే యదార్ధవంతులుగా ఉన్నారు (ఉదా౹౹ జక్కయ్య, సమరయ స్త్రీ, వ్యభిచారిణియైన స్త్రీ)

పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి కావాల్సింది నీతిక్రియలు కాదు! యదార్థత!! మన వద్ద నుండి దేవుడు కోరుకునేది అదే. ఐతే తన స్థితి నుండి లేచి దేవుని పరిశుద్ధతలోకి ప్రవేశించాలని దేవుడు ఆహ్వానిస్తాడు.ఆ యదార్థతే ఆ వ్యక్తిని దైవనీతిలోకి నడిపిస్తుంది.




Comments
Post a Comment