సిలువ తీర్పు కోసం యేసు సిద్ధంగా ఉన్న సమయంలో..
పిలాతు యేసుతో--"నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?" అన్నాడు.
అందుకు యేసు--"ఆ అధికారం పైనుంచి(దేవుని నుంచి) నీకు ఇవ్వబడితేనే తప్ప నామీద నీకు అధికారమేమీ ఉండదు" అని జవాబిచ్చాడు.(యోహాను 19:10,11)
✔ విశ్వాసి జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏమీ జరుగదు. ప్రాముఖ్యంగా దేవుణ్ని హత్తుకొని జీవించే విశ్వాసి జీవితంలో, ఏమైన (చేదైన)సంఘటన జరిగిందంటే ఖశ్చితంగా దేవుడే అనుమతించాడని నమ్మాలి.(లూకా 11:49-51)
✔ నీతిమంతుడు అనేకుల చేత ద్వేషించబడతాడు(రుజువు క్రీస్తే). ఆయన్ను పోలి నడిచేవారికి శ్రమలు వస్తాయని ప్రభువు చెప్పాడు. పాపంతో రాజీపడిన క్రైస్తవునికి..లోకం, సాతాను స్నేహితులే!(యాకోబు 4:4).అలాంటి వారితో అపవాదికి ఎలాంటి సమస్య ఉండదు. కాని బలమైన విశ్వాసి సాతానుని సామ్రాజ్యానికి గొడ్డలి పెట్టుగా ఉంటాడు. కాబట్టి శోధనల ద్వారా విశ్వాసిని జల్లించాలని అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడి సంబంధులను(మత సంబంధులను, లోకస్థులను) ప్రేరేపిస్తూ శ్రమలకు, హింసలకు గురిచేయలని చూస్తాడు.
✔ విశ్వాసి నిబ్బరంగా ఉండాల్సిన విషయం ఏమిటంటే, దానికి దేవుని అనుమతి అవసరం. ఆయన భరించదగిన శ్రమనే అనుమతిస్తాడు. శ్రమగుండా వెళ్లే విశ్వాసిని చూసి అపవాది సంబంధులు వారి నోటికి దొరికినందుకు, విజయం సాధించినట్లు సంతోషిస్తారు. కాని దేవుని అధికారాన్ని చూసిన విశ్వాసి నిబ్బరంగా ఉంటాడు(క్రీస్తు వలె).దేవుడు మనకు ప్రతి మంచి ఈవులను పంపుతాడు(శ్రమ కూడా), ఎందుకంటే ఆయన మంచి తండ్రి.
✔ సమస్తం పై గల దేవుని అధికారాన్ని అర్ధం చేసుకున్న విశ్వాసి ఎన్నడూ కదల్చబడడు. ఎవ్వరి మీదా సణగడు, ఎవ్వరిని ద్వేషించడు. అతన్ని ద్వేషించువారు(వారికి తెలియకుండానే) దేవుని చిత్తాలను మోసికొచ్చి, తనకు దగ్గర చేసేవారేనని గ్రహిస్తాడు.
➡ "క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా?" (రోమా 8:32).
చివరికి మరణానికి అప్పగించబడి, చేరువలో ఉన్నా, మనం గ్రహించాల్సిన మాట.."నేను ఆయన ప్రేమచేత భద్రం చేయబడి ఉన్నాను".
పిలాతు యేసుతో--"నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?" అన్నాడు.
అందుకు యేసు--"ఆ అధికారం పైనుంచి(దేవుని నుంచి) నీకు ఇవ్వబడితేనే తప్ప నామీద నీకు అధికారమేమీ ఉండదు" అని జవాబిచ్చాడు.(యోహాను 19:10,11)

చివరికి మరణానికి అప్పగించబడి, చేరువలో ఉన్నా, మనం గ్రహించాల్సిన మాట.."నేను ఆయన ప్రేమచేత భద్రం చేయబడి ఉన్నాను".
Comments
Post a Comment