❇ దేవుడు గబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే గ్రామానికి, ఒక కన్య దగ్గరకు పంపాడు.ఆమె పేరు మరియ. ఆమెకు యోసేపు అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.
ఆ దూత-"నీకు శుభం! ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు"
మరియ ఆ మాటకు కంగారు పడిపోయి, ఆలోచిస్తుండగా..
దూత- "మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. ఆయనకు "యేసు" అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై,"సర్వోన్నతుని కుమారుడు" అని పిలువబడతాడు..ఆయన రాజ్యానికి అంతం ఉండదు."
మరియ-"నాకింకా పెండ్లి కాలేదే! ఇది ఎలా సాధ్యమవుతుంది?"
దూత-"పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దైవకుమారుడని పిలువబడతాడు"
మరియ- "నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుగాక" అన్నది. ❇
✔ క్రీస్తు మరియ శరీరంలో రూపొందుకోవాలంటే ఆమె తన ప్రణాళికలను(నిశ్చితార్థం), పేరు ప్రతిష్టలను సైతం వదులుకోవడానికి సిద్ధపడాల్సివుంది. అంతే కాదు అవమానాలు, నిందలు, శ్రమలను సైతం భరించడానికి సిద్ధపడాలి. దేవుని మార్గంలో నడవాలంటే వీటన్నింటి కొరకు మనస్సును ముందుగానే సిద్ధంచేసుకోవాలి. శ్రమ లేకుండా క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడదు. నేను అనే స్వభావం చంపుకోవడానికి సిద్ధపడకుండా(నీ సిలువను నీవు మోయకుండా) ఆయన్ను వెంబడించలేవు.
✔ క్రీస్తు స్వరూప్యం ఏ మనిషి తనకు తాను సంపాదించుకోలేనిది. అది అసాధ్యం. మనకు మరొక బలమైన శక్తి అవసరం. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు.మరియలో పరిశుద్ధాత్మడే క్రీస్తును రూపొందించాడు. అలానే మనలో కూడా క్రీస్తును రూపొందించేది ఆయనే. వాక్య జ్ఞానం కాదు. సాతానుకు మనందరికంటే వాక్యం బాగా తెల్సు. కానీ వాడు విధేయత చూపడు. భ్రమ పడొద్దు. కావాల్సింది విధేయత చూపడం, జ్ఞానం కాదు.
↪ మరియ వలె దేవునితో "నీ దాసుడను/దాసురాలను, నీ చిత్తము నాలో జరిగించమని" విశ్వాసంతో వేడుకున్నప్పుడు, దేవుని రాజ్యం మన దేహంలో ఆరంభమౌతుంది. మనం దీవెనకరమైన జీవితంలోకి ప్రవేశిస్తాము.
Comments
Post a Comment